Actor Ponnabalam About Chiranjeevi: తమిళ నటుడు పొన్నంబలం గురించి తెలియని తెలుగు వారు ఉన్నారు. ఎందుకంటే ఆయన తెలుగులో కూడా అనేక సినిమాలతో తెలుగువారికి దగ్గరయి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే గత ఏడాది ఆయన అనారోగ్యం బారిన పడితే మెగాస్టార్ చిరంజీవి ఆదుకుంటానని హామీ ఇచ్చినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. వాస్తవానికి చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడులో పొన్నంబలం కలిసి నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించాడు పొన్నంబలం. ఇక కొద్ది రోజుల క్రితం కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించి చావు బతుకుల్లో ఉన్నా అనే విషయాన్ని బయట పెట్టాడు. అప్పుడు చిరంజీవి ఆదుకున్నట్లుగా వార్తలు బయటకు వచ్చాయి ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జీవితాన్ని చిరంజీవి మళ్ళీ నిలబెట్టారని తనకు పునర్జన్మ ఇచ్చారని పొన్నంబలం పేర్కొన్నాడు. ఈ ఫిబ్రవరి 10వ తేదీన చెన్నై అపోలో హాస్పిటల్ లో కిడ్నీ మార్పిడి విజయవంతంగా చేయించుకున్నానని ఆయన పేర్కొన్నారు.


సదర్ ఇంటర్వ్యూలో పొన్నంబలం మాట్లాడుతూ తాను అతిగా తాగటం వల్ల కిడ్నీ సమస్య వచ్చిందని అందరు అనుకుంటున్నారని కానీ తన సోదరుడే తనను చంపాలని చూసాడని అన్నారు. తన తండ్రికి నలుగురు భార్యలని మూడో భార్య కొడుకు తన దగ్గర మేనేజర్ గా పని చేసేవాడని అన్నారు. తన ఎదుగుదల తట్టుకోలేక తన ఆహారంలో స్లో పాయిజన్ కలిపి తినిపించాడని, ఆ విషయం ఈ మధ్యనే తనకు తెలిసిందని చెప్పుకొచ్చారు.


వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేని పరిస్థితుల్లో అందరికీ కాల్ చేసినట్లే చిరంజీవికి కూడా కాల్ చేసి నా పరిస్థితి చెప్పానని అయితే చిరంజీవి సహాయం అడిగితే లక్షో రెండు లక్షలు సహాయం చేస్తాడని అనుకున్నాను కానీ ఫోన్ చేసిన ఐదు నిమిషాల్లోనే చెన్నైలో ఉన్న అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ చేయించమని అడిగారని అక్కడికి వెళితే కనీసం ఎంట్రీ ఫీజు కూడా తనని అడగలేదని అన్నారు. మొత్తం తనకు 40 లక్షల ఖర్చు అయితే అంతా ఆయనే భరించారని చిరు చెప్పుకొచ్చారు. దీంతో మెగాస్టార్ అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది మా మెగాస్టార్ అంటే అంటూ ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: RGV Comments: తాగండి, తినండి, సెక్స్ చేయండి... విద్యార్ధులకు వర్మ సూచనలు!


Also Read: Gopireddy Challenges Balakrishna:మనిషే కదా..మూడో కన్ను ఎక్కడిది..బాలకృష్ణకు ఎమ్మెల్యే సవాల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook