ప్రకాశ్ రాజ్‌కు గాయం.. సర్జరీ కోసం హైదరాబాద్‌కు పయనం!
Prakash Raj: నటుడు ప్రకాశ్‌రాజ్ గాయాలపాలయ్యారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన లొకేషన్లో గాయపడ్డారు.
Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ గాయపడ్డారు. ధనుష్(Dhanush) హీరోగా నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై(Chennai)లో జరుగుతోంది.
కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తుండగా..ప్రకాశ్‌రాజ్(Prakash Raj) ప్రమాదానికి గురయ్యారు. చేతితోపాటు పలు చోట్ల స్వల్ప గాయాలయ్యానట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సన్‌షైన్ ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ జరగనుంది.
Also Read: పాగల్ ట్రైలర్ విడుదల..విశ్వక్ సేన్ కుమ్మేశాడు భయ్యా!
ప్రస్తుతం ఆయన చెన్నై నుంచి హైదరాబాద్‌కి పయనమవుతున్నారు. ‘‘చిన్న ఫ్రాక్చర్ జరిగింది. నేను బాగానే ఉన్నాను. చింతించాల్సింది పనిలేదు.. నా స్నేహితుడు డా.గురవారెడ్డి సర్జరీ చేయనున్నారు’’ అని ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్(Twitter)లో పేర్కొన్నారు.
నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన దర్శకుడిగా, నిర్మాతగా కూడా చేశాడు. తన నటనకు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన త్వరలో జరగబోయే ‘మా(MAA) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook