Actor Rajasekhar family tested positive for COVID-19: హీరో రాజశేఖర్, అతని కుటుంబ సభ్యులకు కరోనావైరస్ సోకినట్టు రాజశేఖర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. వారం రోజుల క్రితం కరోనావైరస్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్దారణ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజశేఖర్, ఆయన భార్య జీవిత ( Jeevitha Rajasekhar ) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే తమ కుమార్తెలు శివానీ, శివాత్మికలు పూర్తిగా కరోనా నుండి కోలుకున్నారని, తను, జీవిత కూడా ఆరోగ్యంగానే ఉన్నామని నటుడు డా రాజశేఖర్ ట్విటర్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతానికి తాము కూడా కోలుకుంటున్నామని.. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అవుతామని రాజశేఖర్ అభిమానులకు వెల్లడించాడు. Also read : Rana Daggubati: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ హనిమూన్ ట్రిప్ వెళ్లారా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"195196","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ప్రస్తుతం నీలకంఠ డైరెక్షన్‌లో నటిస్తున్న రాజశేఖర్ తదుపరి చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభించాలనుకుంటున్న సమయంలోనే కరోనా లక్షణాలు ( Coronavirus symptoms) కనిపించాయి. ఇంకా ఆ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభించలేదు. రాజశేఖర్ చివరిసారిగా అర్జున సినిమాలో నటించాడు. రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ ( Shivani Rajasekhar ) ప్రస్తుతం వెబ్ మూవీలో నటిస్తుండగా, కృష్ణవంశి డైరెక్షన్‌లో వస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో శివాత్మిక ( Shivathmika Rajasekhar) నటిస్తోంది. ఆనంద్ దేవరకొండ నటించిన దొరసాని చిత్రంతో శివాత్మిక రాజశేఖర్ సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. Also read : Ravi Teja’s Khiladi: రవితేజ కొత్త సినిమా డీటేల్స్ ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe