Rana Daggubati: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ హనిమూన్‌కి వెళ్లారా ?

రానా దగ్గుబాటి ( Rana Daggubati ) కరోనా లాక్‌డౌన్‌లో తను ఇష్టపడిన అమ్మాయి మిహీక బజాజ్‌ను ( Miheeka Bajaj ) ఒప్పించి ఆగస్టులో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అందమైన జంట ప్రస్తుతం ఫారిన్‌కి వెకేషన్ కోసం వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇది వారి హనీమూన్ ట్రిప్ అయి ఉండొచ్చు అని టాక్. రానా దగ్గుబాటి, మిహీక కలిసి దిగిన ఒక సెల్ఫీ ఫొటోను మిహీక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలో వారిద్దరు ఒక బీచ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది!

Last Updated : Oct 18, 2020, 05:31 AM IST
Rana Daggubati: రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ హనిమూన్‌కి వెళ్లారా ?

రానా దగ్గుబాటి ( Rana Daggubati ) కరోనా లాక్‌డౌన్‌లో తను ఇష్టపడిన అమ్మాయి మిహీక బజాజ్‌ను ( Miheeka Bajaj ) ఒప్పించి ఆగస్టులో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అందమైన జంట ప్రస్తుతం ఫారిన్‌కి వెకేషన్ కోసం వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇది వారి హనీమూన్ ట్రిప్ అయి ఉండొచ్చు అని టాక్. రానా దగ్గుబాటి, మిహీక కలిసి దిగిన ఒక సెల్ఫీ ఫొటోను మిహీక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలో వారిద్దరు ఒక బీచ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది! Also read : Ravi Teja’s Khiladi: రవితేజ కొత్త సినిమా డీటేల్స్ ఇవే

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Just because 🥰🥰 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on

రానా, మిహీకాలు పెళ్లి ( Rana Daggubati, Miheeka Bajaj wedding ) తరువాత హానీమూన్‌కి వెళ్లకుండా చేసింది కరోనా. గతంలో బాలీవుడ్ నటి నేహా ధూపియా ( Actress Neha Dhupia ) చేసిన ఒక ఇంటర్వ్యూలో రానాని కరోనా తీవ్రత తగ్గితే హానీమూన్‌కి ఎక్కడికి వెళ్తారు అని అడగగా, దానికి రానా తనకు ఎంతో ఇష్టమైన హనీమూన్ స్పాట్ ఆమ్‌స్టర్‌డ్యామ్‌కి ( Amsterdam honeymoon trip ) వెళ్తా అని వెల్లడించారు. ఐతే ఇప్పుడిప్పుడే కొంచెం కరోనా తీవ్రత తగ్గుతోంది కనుక ఈ జంట ఆమ్‌స్టర్‌డ్యామ్ అందాలు చూసి సరదాగా గడిపిరావడానికి వెళ్ళినట్టు తెలుస్తోంది. Also read : Amma Rajasekhar: అమ్మరాజశేఖర్ ఎంతపని చేశాడు!

రానా లాక్ డౌన్ తరువాత తిరిగి తన సినిమాల షూటింగ్‌ను ఇంకా ప్రారంభించలేదు. వేణు ఉడుగుల డైరెక్షన్‌లో రానా నటిస్తున్న 'విరాటపర్వం' చిత్ర షూటింగ్ ( Virata parvam shooting ) వచ్చే నెలలో తిరిగి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రానా సరసన సాయి పల్లవి ( Actress Sai Pallavi ) నటిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News