Rajasekhar: కరోనాను జయించిన రాజశేఖర్
సుదీర్ఘ పోరాటం తరువాత రాజశేఖర్ కరోనాపై విజయం సాధించారు. ఆయన ఆరోగ్యం మెరుగు అవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు.
డాక్టర్ రాజశేఖర్ ప్యాన్స్ కు శుభవార్త. సుమారు 30 రోజుల నుంచి హైదరాబాద్ లోని ( Hyderabad ) సిటీ న్యూరో సెంటర్ హస్పిటల్లో చికిత్స పొంతుతున్న రాజశేఖర్ ( Actor Rajasekhar ) కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. కొద్ది కాలం క్రితం రాజశేఖర్ సతీమణి జీవిత, వారి కుమార్తెలకు కూడా కోవిడ్-19 ( Covid-19) సోకగా చికిత్స అనంతరం కోలుకున్నారు.
Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే
సుదీర్ఘ పోరాటం తరువాత రాజశేఖర్ కూడా కరోనాపై విజయం సాధించారు. ఆయన ఆరోగ్యం మెరుగు అవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు.
హస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి బయల్దేరే ముందు వైద్య సిబ్బందితో రాజశేఖర్ దంపతులు ఫోటోలు దిగి.. వారికి ధన్యవాదాలు తెలిపారు. నెల పాటు ఎంతో ప్రయత్నించి తన భర్త ప్రాణాలు కాపాడినందుకు ఆమె వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Also Read | Zero Corona: కెనడాలోని ఈ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు
రాజశేఖర్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం ( Health ) గురించి తరచూ కుమార్తెలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసేవారు. అయితే ఆ షేరింగ్ వల్ల కొంత గందరగోళం కూడా ఏర్పడింది. రాజశేఖర్ ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేయండి అని శివాత్మకు ట్వీట్ చేయడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. కానీ తరువాత అసలు విషయం చెబుతూ కరోనావైరస్ నుంచి కోలుకుంటున్నారు అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYe