Movie News: అకౌంట్‌లో రూ.18, ఒక బిస్కెట్ ప్యాకెట్‌తో జీవనం.. కట్ చేస్తే ఒక్కో మూవీకి రూ.6 కోట్లు.. ఎవరు ఆ స్టార్ యాక్టర్..?
Actor Rajkummar Rao: బాలీవుడ్ యాక్టర్ రాజ్‌కుమార్ రావు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కష్టాలను పంచుకున్నాడు. రోజుకో బిస్కెట్ ప్యాకెట్‌తో కడుపు నింపుకున్నట్లు చెప్పుకొచ్చాడు. బ్యాంక్‌లో కేవలం రూ.18తో కాలం గడిపానని అన్నాడు. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం స్టార్ యాక్టర్‌గా ఎదిగిన ఆయన.. ఒక్కో మూవీ రూ.6 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Actor Rajkummar Rao: సినీ ఇండస్ట్రీలో ఉండే కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాగ్రౌండ్ లేకపోతే.. కనీసం స్టూడియోల గేటు కూడా దాటనీయరు. అయితే కొంతమంది నటులు మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. చిన్న చిన్న అవకాశాలను అందిపుచ్చుకుని ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఎదిగారు. బాలీవుడ్ విషయానికి వస్తే.. షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, ఆయుష్మాన్ ఖురానా నుంచి ఇర్ఫాన్ ఖాన్ వరకు ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్‌లు లేకున్నా.. తమ టాలెంట్‌తో సూపర్ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ కోవలోకే మరో నటుడు చేరాడు. ఒక్కప్పుడు బ్యాంక్ అకౌంట్‌లో రూ.18 మాత్రమే ఉన్న వ్యక్తి.. ఇప్పుడు ఒక్కో సినిమా భారీగా వసూలు చేసే స్థాయికి ఎదిగాడు. బిగ్‌స్క్రీన్‌పై ఎన్నో హిట్లు సాధించి.. ఓటీటీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. అంతేకాదండోయ్.. ఓ సినిమాలో తన నటనకు జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఆయన రాజ్‌కుమార్‌రావు.
లవ్ సెక్స్ ఔర్ ధోఖా అనే మూవీతో రాజ్‌కుమార్ రావు తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత బరేలీ కి బర్ఫీ, తలాష్: ది ఆన్సర్ లైస్ వితిన్, స్ట్రీ, బధాయి దో వంటి సూపర్ హిట్స్ అందించాడు. షాహిద్ సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. గన్స్ & గులాబ్స్ అనే వెబ్ సిరీస్‌లో తన నటనతో అందరినీ కట్టిపాడేశాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్ రావు తన కష్టాల గురించి చెప్పుకున్నాడు. థియేటర్ సినిమా చూసేందుకు 70 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లానని చెప్పాడు. "నేను గుర్గావ్‌లో ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. ఆ సమయంలో మా ఊరు ఒక చిన్నది. నాకు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే పిచ్చి. నేను ఏం చేయాలనుకున్నానో నాకు అప్పుడే తెలిసిపోయింది. నేను థియేటర్‌లో సినిమా చూసేందుకు ఢిల్లీకి 70 కిమీ పైగా సైకిల్ తొక్కొ వెళ్లేవాడిని. గర్ల్ ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళ్లేవాడి మాదిరి థియేటర్‌కు వెళ్లే వాడిని.
నా బ్యాంక్ అకౌంట్‌లో కేవలం 18 రూపాయలతో ముంబైకి వచ్చాను. ఇక్కడ ఒక బిస్కెట్ ప్యాకెట్‌తో జీవించాను. నేను FTIIలో కష్టపడి పనిచేశాను. నేను ముంబైకి వచ్చిన తరువాత చాలా కష్టమనిపించింది. రూ.18తో రోజుకు ఒక పార్లే-జీ ప్యాకెట్‌తో జీవించిన సందర్భాలు ఉన్నాయి. అదృష్టవశాత్తూ నాకు ఫిల్మ్ స్కూల్ స్నేహితులు సాయం చేశారు. నేను ఎప్పటి నుంచో నటుడిని కావాలని కలలుకన్నాను. నాకు నటన తప్ప మరో ఆలోచన లేదు.." అంటూ రాజ్‌కుమార్ రావు తన కష్టాలను చెప్పుకొచ్చాడు.
ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్న ఈ స్టార్ యాక్టర్.. ఒక్కో మూవీకి రూ.6 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో రూ.44 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ గన్స్ & గులాబ్స్ పార్ట్-2 కోసం రెడీ అవతున్నాడు. మహేంద్ర అగర్వాల్ మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నాడు.
Also Read: Washing Machine Offers: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.3,990కే రియల్ మీ 8.5 Kg Top Load వాషింగ్ మెషిన్..
Also Read: Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతం, మరో ఘనత సాధించిన ఇస్రో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter