Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతం, మరో ఘనత సాధించిన ఇస్రో

Aditya L1 Mission: ఇస్రో మరో మైలురాయి సాధించింది. సూర్యుని అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 మిషన్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. నిర్దేశిత లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో చేరుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 6, 2024, 07:55 PM IST
Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతం, మరో ఘనత సాధించిన ఇస్రో

Aditya L1 Mission: చంద్రయాన్ 3 విజయం తరువాత రెట్టించిన ఉత్సాహంతో సూర్యునిపై ప్రయోగించిన ఆదిత్య ఎల్1 కూడా చివరి లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోవడంతో ఇస్రో కీర్తి మరింతగా పెరిగింది. నిర్దేశిత లాంగ్రేజియన్ పాయింట్‌ను విజయవంతంగా చేరుకుంది ఆదిత్య ఎల్ 1 మిషన్. సూర్యుని అధ్యయనంలో ఇది మరో కీలక ఘట్టం కానుంది. 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వరుస విజయాలు సాధిస్తోంది. చంద్రయాన్ 3 విజయవంతం తరువాత ఇస్రో ఇప్పుడు సూర్యునిపై అధ్యయనం ప్రారంభించింది. సూర్యునిపై అధ్యయనం నిమిత్తం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 మిషన్ విజయవంతంగా పూర్తయింది. చివరి నిర్దేశిత లక్ష్యాన్ని అనుకున్న సమయానికి చేరుకుంది. ఇస్రో చేపట్టిన తొలి సోలార్ అబ్జర్వేటరీ ప్రాజెక్టు ఇది. లాగ్రేంజియన్ పాయింట్ అనేది భూమి నుంచి 1.5 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. విశేషమేమంటే భూమికి, సూర్యునికి మధ్య ఉండే దూరంలో ఇది కేవలం 1 శాతం మాత్రమే. సూర్యుని అతి దగ్గర నుంచి పరిశీలించేందుకు వీలు కలిగిన పాయింట్ ఇదొక్కటే. అందుకే ఈ పాయింట్ అంత కీలకం. ఈ పాయింట్‌పై సూర్య గ్రహణం ప్రభావం ఉండదు. 2023 సెప్టెంబర్ 2వ తేదీన పీఎస్ఎల్వి సి57 వాహన నౌక ద్వారా ఇస్రో ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగించింది. 

దాదాపు 4 నెలల ప్రయాణం తరువాత అంటే 127 రోజుల తరువాత ఇవాళ సాయంత్రం 4 గంటలకు లాంగ్రేజియన్ పాయింట్‌కు చేరుకుంది. ఇక నుంచి ఐదేళ్లపాటు ఇదే పాయింట్‌లో తిరుగుతూ సూర్యుని వాతావరణంలో జరిగే మార్పుల్ని ఎప్పటికప్పుడు పోటోలతో ఇస్రోకు పంపించనుంది. ఇందులో 7 పేలోడ్లు ఉన్నాయి. విద్యుత్ అయస్కాంతం, అయస్కాంత క్షేత్ర డిటెక్టర్ల సహాయంతో సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌తో పాటు సూర్యుని వెలుపలి పొర కొరోనాను ఆదిత్య ఎల్ 1 మిషన్ అధ్యయం చేస్తుంది. అసలు కొరోనా ఎలా వేడెక్కుతుంది, కొరోనల్ మాస్ ఎజక్షన్ ఎలా ఉంటుంది, సౌర వాతావరణంలో ప్లాస్లా ఉష్ణోగ్రత, సాంద్రత సమాచారం సేకరించి ఇస్రోకు పంపిస్తుంది. ఈ అధ్యయనం ద్వారా సౌర తుపానులు సంభవించే అవకాశాల్ని ముందుగా తెలుసుకునే అవకాశముంటుంది. 

ఇలా తెలుసుకోవడం ద్వారా అంతరిక్షంలో ఉండే వివిధ రకాల ఉపగ్రహాలు దెబ్బతినకుండా కాపాడవచ్చు. ఎందుకంటే అంతరిక్షంలో ఇస్రోకు చెందిన ఉపగ్రహాలు 50కు పైగా ఉన్నాయి. వీటి ద్వారా భూమిపై సమాచార వ్యవస్థ నడుస్తోంది. ఈ ఉపగ్రహాల్ని రక్షించుకునేందుకు ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగం చాలా ఉపయోగపడుతుంది. ఆదిత్య ఎల్ మిషన్ అందించే సమాచారం ద్వారా ఉపగ్రహాల్ని రక్షించుకునేందుకు వీలుంటుంది. 

Also read: Sajjala Comments: వైఎస్ మరణం వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News