Sarath Babu Died: టాలీవుడ్లో విషాదం.. శరత్ బాబు కన్నుమూత
Sarath Babu Passed Away News: చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో సినీ పరిశ్రమకు చెందిన నటుడు శరత్ బాబు అసువులు బాసారు. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Sarath Babu Passed Away: చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో సినీ పరిశ్రమకు చెందిన నటుడు శరత్ బాబు కన్నుమూశారు. నిజానికి ఆయన సినీ ప్రేక్షకులందరికీ విషాదంలోకి నెట్టి కన్నుమూసినట్లుగా చాలా కాలం క్రితం రెండు దఫాలు ప్రచారం జరిగింది. నిజానికి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతానికి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.
.నిజానికి శరత్ బాబు అస్వస్థతకు గురైన వెంటనే ముందుగా బెంగళూరు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు తర్వాత అక్కడ మెరుగు కాకపోవడంతో అక్కడి నుంచి హైదరాబాదులోని ఏఐజీ హాస్పిటల్ కి ఆయనని తరలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని ఆయనను ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగగా ఆయనని రూమ్ కి షిఫ్ట్ చేసినట్టు క్లారిటీ ఇచ్చారు.
Also Read: Sarath Babu Death: శరత్ బాబు మృతి అంటూ ప్రచారం.. 'చంపకండి
ఇక అయితే అప్పటి నుంచి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి వార్తలు లేవు కానీ మధ్యలో ఒక రోజు సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని ప్రచారం మొదలైంది. ఆ తరువాత ఆయన సోదరి, సోదరుడి కుమారుడు ఆయన ఆరోగ్యం బానే ఉందని దయ చేసి చంపేయవద్దని వెల్లడించారు. ఇక నటుడిగా శరత్ బాబు దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లో నటించి మెప్పించారు. తెలుగు వాడే అయిన ఆయన తెలుగు సినిమాలతో నటన ప్రస్థానం మొదలు పెట్టి తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో అనేక సినిమాల్లో హీరోగా నటించారు. క్యారెక్టర్లు చేశారు. 1973 వ సంవత్సరంలో సినీ రంగ ప్రవేశం చేసిన శరత్ బాబు రామరాజ్యం సినిమాలో హీరోగా కనిపించరు. ఇక ఆయా ఇప్పటివరకు దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 1981, 88, 89 సంవత్సరాల్లో మూడు సార్లు ఉత్తమ సహాయం అందుకున్నారు శరత్ బాబు. ఇక నరేష్ పవిత్ర జంటగా నటిస్తున్న మళ్లీ పెళ్లి అనే సినిమాలో కృష్ణ పాత్రలో నటిస్తున్నారని చెబుతున్నారు. ఇక ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది.
Also Read: Sarath Babu: నటుడు శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook