siddhant suryavanshi Death : కుసుమ్ వారిస్, సూర్య పుత్ర్ కర్ణ సీరియల్స్‌తో ఫేమస్ అయిన సిద్దాంత్ వీర్ సూర్యవంశీ (46) కాసేపటి క్రితమే కన్నుమూశారు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. జిమ్‌లో ఇలా చెమటోడ్చుతున్న సమయంలోనే హార్ట్ ఎటాక్ రావడంతో కన్నుమూసినట్టు సమాచారం అందుతోంది. ఇలా కుర్ర హీరోలంతా కూడా జిమ్‌లో కష్టపడుతూనే కుప్పకూలిపోతోన్నారు. సిద్దార్థ్ శుక్లా, పునీత్ రాజ్ కుమార్ ఇలా ఎంతో మంది జిమ్‌లో వర్కవుట్లు చేస్తూనే మరణించిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిద్దాంత్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆనంద్ సూర్యవంశీగా ఉన్న ఆయన పేరు.. మొదటి సీరియల్ కుసుమ్ సీరియల్‌తో సిద్దాంత్ సూర్యవంశీగా మారిపోయాడు.  ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలో లీడ్ రోల్స్ పోషించాడు. కసౌతి జిందగీ కాయ్, క్రిష్ణ అర్జున్, క్యా దిల్ మైన్ హై వంటి ధారావాహికల్లో ఎన్నో ముఖ్యమైన పాత్రల్లో కనిపించాడు. క్యోన్ రిష్తోన్ మైన్ కట్టి బట్టి, జిడ్డి దిల్ వంటివి ఆయన చివరగా చేసిన ప్రాజెక్టులు.


సిద్దాంత్ పర్సనల్ లైఫ్ కూడా కాంట్రవర్సీగానే ఉంటుంది. ఇరాతో అతనికి 2015లో విడాకులయ్యాయి. ఇరా సిద్దాంత్‌లకు ఓ పాప జన్మించింది. ఆ తరువాత 2017లో అలీసియాను పెళ్లి చేసుకున్నాడు. అలీసియా సిద్దాంత్‌లకు ఓ బాబు పుట్టాడు. ఇప్పుడు సిద్దాంత్ మరణ వార్తతో బాలీవుడ్ బుల్లితెర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. 


ఇలా మితిమీరిన వ్యాయామం, ఓ క్రమ పద్దతి లేని వర్కౌట్లు ప్రాణాంతకంగా మారుతోన్నాయి. సెలెబ్రిటీలు, కుర్ర హీరోలు ఇలా వర్కౌట్లు చేస్తూ కుప్పకూలడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. పునీత్ రాజ్ కుమార్ మరణించిన సమయంలోనూ ఈ వర్కవుట్ల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే.


Also Read : Anasuya Anchor Ravi Fun : అనసూయ ఫోన్‌ సీక్రెట్లు.. అడిగేందుకు భయపడ్డ యాంకర్ రవి


Also Read : Yashoda Movie Review : యశోద రివ్యూ.. సమంత.. మోసింది భారమంతా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook