Sonu Sood : చట్టానికి కట్టుబడి ఉంటా, నా ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి ప్రజా సేవ కోసమే, రాజ్యసభ సీట్ ఆఫర్ చేసినా వద్దని చెప్పా : సోనూసూద్
Sonu Sood Reveals abou Rajya Sabha Seat : రాజ్యసభ సభ్యత్వం ఇస్తామంటూ తనకు రెండు పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయన్నారు. కానీ రాజకీయాల్లో చేరేందుకు తాను మానసికంగా సిద్ధం కాకపోవడంతో తిరస్కరించానని చెప్పుకొచ్చారు సోనూసూద్.
Actor Sonu Sood Tweets After Tax Raids Every Rupee In My Foundation is awaiting : అన్ని వేళలా మన వాదనను మనం వినిపించలేకపోవచ్చు... కానీ, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అంటున్నారు ప్రముఖ నటుడు సోనూసూద్ (Sonu Sood). తన ఫౌండేషన్‌లోని (Foundation) ప్రతి రూపాయి ప్రజల సేవ కోసం, వారి ప్రాణాలను రక్షించడం కోసం ఎదురు చూస్తోందన్నారు. సేవా కార్యక్రమాలకు అవసరమైన డబ్బు కోసమే బ్రాండ్ల తరపున ప్రచారం చేశా అన్నారు ఆయన. ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చిన ప్రతి రూపాయికి తాను లెక్క చెబుతానని వెల్లడించారు. తాను ప్రజా సేవ కోసం ఖర్చు చేసే సొమ్ము కేవలం విరాళాలే రూపంలో వచ్చింది మాత్రమే కాదు అందులో బ్రాండ్లకు ప్రచారకర్తగా (Brand ambassador) తాను సంపాదించిన డబ్బు కూడా ఉందన్నారు.
కాగా సోనూసూద్‌తోపాటు ఆయన అనుచరులు రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) (central board of direct taxes) వెల్లడించిన విషయం తెలిసిందే. సోనూసూద్ నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు గతవారం సోదాలు నిర్వహించారు. సోదాల తర్వాత సోనూసూద్ పలు వివరాలు తెలిపారు.
18 గంటలు కూడా పట్టదు
తన వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఇంకా చదవని మెసేజ్‌లు దాదాపు 50వేల పైనే ఉన్నాయన్నారు. సాయం కోసం ఎంతోమంది అభ్యర్థిస్తున్నారని.. దీంతో రూ.18 కోట్లు (18 crores) ఖర్చు చేయాలనుకుంటే 18 గంటలు కూడా పట్టదని పేర్కొన్నారు. కానీ ప్రతి పైసా సరైన విధంగా, అర్హులైన వారి కోసమే ఖర్చు పెట్టాలన్నదే తన ఆలోచన అని తెలిపారు.
రెండు పార్టీల నుంచి ఆఫర్లు
రాజ్యసభ సభ్యత్వం (rajya sabha seat) ఇస్తామంటూ తనకు రెండు పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయన్నారు. కానీ రాజకీయాల్లో (politics) చేరేందుకు తాను మానసికంగా సిద్ధం కాకపోవడంతో తిరస్కరించానని చెప్పుకొచ్చారు సోనూసూద్ (Sonu Sood). తన సేవా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. తాజాగా బ్యాక్ టు రియాల్టీ ఒక ట్వీట్ రీ ట్వీట్ చేశారు సోనూసూద్.
Also Read : Elon Musk: మరో వివాదంలో ఎలాన్ మస్క్, గిగా ఫ్యాక్టరీ ఇండియాకు రానుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook