Sonu Sood Income Tax: సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేత, దాతల నుంచి సేకరించిన విరాళాలనూ ఖర్చు పెట్టలేదట

Sonu Sood Evaded Over ₹ 20 Crore : సోనూసూద్‌కు దాతల నుంచి సేకరించిన విరాళాలను మొత్తం ఖర్చుపెట్టలేదని తాజాగా ఐటీ అధికారులు వెల్లడించారు. అలాగే పన్ను కూడా ఎగవేసినట్లు చెప్పారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 18, 2021, 04:17 PM IST
  • సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేశాడన్న
    ఆదాయపన్ను శాఖ అధికారులు
  • మూడు రోజుల పాటు సోదాలు
  • రూ.18 కోట్ల సేకరించి రూ.1.9 కోట్లు మాత్రమే ఖర్చు
Sonu Sood Income Tax: సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేత, దాతల నుంచి సేకరించిన విరాళాలనూ ఖర్చు పెట్టలేదట

Actor Sonu Sood Evaded Over ₹ 20 Crore In Taxes: Income Tax Department : కొవిడ్ మహమ్మారి వేళ అందరికీ సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే సోనూసూద్‌కు (Sonu Sood) దాతల నుంచి సేకరించిన విరాళాలను మొత్తం ఖర్చుపెట్టలేదని తాజాగా ఐటీ అధికారులు వెల్లడించారు. అలాగే పన్ను కూడా ఎగవేసినట్లు చెప్పారు. సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఐటీ అధికారులు (Income tax officers) వెల్లడించారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్ అధికారులు సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. మూడురోజులు పాటు ఈ సోదాలు చేపట్టారు.

క్రౌడ్‌ ఫండింగ్ 

సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్( రెగ్యులేషన్) యాక్ట్‌ను ఉల్లంఘించారని ఆదాయపన్ను శాఖ అధికారులు పేర్కొన్నారు. క్రౌడ్‌ ఫండింగ్(crowdfunding) ద్వారా విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించినట్లు తెలిపారు. సోనూసూద్‌తో పాటు ఆయన సహచరుల కార్యాలయాల్లోనూ పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు వెల్లడించారు ఐటీ అధికారులు.

Also Read : Kajal Aggarwal: తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్..? త్వరలోనే సినిమాలకు గుడ్ బై..??

రూ.18 కోట్ల సేకరించి రూ.1.9 కోట్లు మాత్రమే ఖర్చు

కొవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో సోనూసూద్‌ ((Sonu Sood)ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని ఐటీ అధికారులు వెల్లడించారు. అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని చెప్పారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమానికి ఢిల్లీ ప్రభుత్వం (delhi government) సోనూసూద్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ సోదాలు జరపడంపై ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన విమర్శలు చేస్తున్నాయి.

Also Read : Punjab Crisis: మరికాస్సేపట్లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ రాజీనామా, ముదిరిన వి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News