Actor VK Naresh Assets and Networth విజయనిర్మల కుమారుడు, నటుడు నరేష్ గురించి గత కొద్ది కాలంగా మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. తన సహ నటి పవిత్ర లోకేష్ తో ఆయన సహజీవనం చేస్తున్నారని, వివాహం కూడా చేసుకున్నారని రకరకాల ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన మూడో భార్య రమ్య రఘుపతి కన్నడ మీడియాలో వీరిద్దరి మీద సంచలన ఆరోపణలు చేయడమే కాక మైసూర్ హోటల్లో ఒకే గదిలో ఉన్న వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అయితే ఈ నేపథ్యంలో నరేష్ తన డబ్బు కోసమే రమ్య రఘుపతి ఇంత చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఆమె మంచిది అనుకుంటే తానే డబ్బు ఇస్తానని రెండు కోట్లు కూడా తనకు పెద్ద విషయం కాదని ఆయన కామెంట్స్ చేయడంతో అసలు నరేష్ ఆస్తులు ఎంత ఉంటాయి అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. 
నరేష్ ఆస్తుల గురించి పరిశీలిస్తే కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. నరేష్ పేరు మీద హైదరాబాద్ శివారులో ఏకంగా నాలుగు ఫామ్ హౌస్ లు ఉన్నాయట. గచ్చిబౌలిలో ఆయనకు ఉన్న ఫామ్ హౌస్ ఏకంగా 5 ఎకరాల విస్తీర్ణంలో ఉందని అదొక్కటే కాక మొయినాబాద్, శంకర్పల్లి లాంటి ప్రాంతాల్లో కూడా ఫామ్ హౌస్ లో ఉన్నాయని తెలుస్తోంది. నానక్ రామ్ గూడా ప్రాంతంలో ఆయనకు సొంత నివాసం ఉండగా చెన్నైలో కూడా ఒక సొంత ఇల్లు ఉందని సమాచారం. తాను సంపాదించినవే కాక తన తల్లి విజయనిర్మల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఆయనకు స్థిరాస్తులతో పాటు చిరాస్తులు కూడా ఎక్కువగానే ఉన్నాయి అంటున్నారు.  
విజయనిర్మల అలంకార ప్రియురాలు కావడంతో ఎక్కువగా బంగారు ఆభరణాలు చేయించుకునే వారు. ఆ రోజుల్లో బంగారం విలువ తక్కువ కాబట్టి భారీగానే వెచ్చించి ఆమె బంగారం కొనుగోలు చేశారు.  ఆ బంగారం విలువ కూడా కొన్ని కోట్ల రూపాయలలో ఉంటుందని తెలుస్తోంది. ఆమె ఒకప్పుడు స్టార్ నటి తర్వాత కాలంలో నిర్మాతగా మారి దర్శకత్వం కూడా చేశారు. కృష్ణతో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేయడమే గాక ఆయనతో కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. ఆ వచ్చిన లాభాలతో హైదరాబాద్ శివారు నానక్ రామ్ గూడ ప్రాంతంలో మేం కాక చెన్నైలో కూడా అనేక ఆస్తులు కొనుగోలు చేశారు. ఇక వారు కొన్నప్పుడు వాటి విలువ తక్కువే. కానీ కాలక్రమేణా అవి భారీగా రేటు పెరుగుతూ వచ్చాయి. 
విజయనిర్మల కొనుగోలు చేసిన రోజుల్లో వేల రూపాయల ఆస్తులు ఇప్పుడు వందల కోట్ల రూపాయలకు చేరాయి. అలా తల్లి నుంచి నరేష్ కు సంక్రమించిన ఆస్తులు సుమారు 300 కోట్ల రూపాయల దాకా ఉంటాయని అంటున్నారు. తల్లి నుంచి సంక్రమించినవే కాకుండా ఆయన కూడా బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావడంతో ఆయన ఒక సినిమాకి 25 లక్షల నుంచి 50 లక్షల వరకు కాల్ షీట్స్ ని బట్టి చార్జి చేస్తారు. తెలుగు ఇండస్ట్రీలో సొంత లగ్జరీ కార్వాన్ కలిగి ఉన్న నటుడు నరేష్ ఒక్కరే. ఆయన ఆస్తులకు సంబంధించి సరైన సమాచారం ఎవరి దగ్గర లేదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే వందల కోట్ల రూపాయలు ఆయనకు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Major Movie in Netflix: 26/11కి కారణమైన శత్రు దేశంలో కూడా మేజర్ హవా.. పాక్, బంగ్లాలో నెంబర్ 1గా!


Also Read: Hero Vikram Heart Attack: హీరో విక్రమ్ కు తీవ్ర అస్వస్థత.. గుండెపోటుతో హాస్పిటల్ కు!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook