Major Movie in Netflix: 26/11కి కారణమైన శత్రు దేశంలో కూడా మేజర్ హవా.. పాక్, బంగ్లాలో నెంబర్ 1గా!

Major Movie Rocking in Netflix:  26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ లో అసువులు బాసిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించిన మేజర్  సినిమా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది.  ఇండియాలోనే కాదు పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంటున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2022, 10:52 PM IST
  • డిజిటల్ లో మేజర్ హవా
  • ఇండియా నెట్ ఫ్లిక్స్ టాప్ 1గా నిలిచిన మేజర్
  • పాక్, బంగ్లాదేశ్ సహా శ్రీలంకలో కూడా హవా
Major Movie in Netflix: 26/11కి కారణమైన శత్రు దేశంలో కూడా మేజర్ హవా.. పాక్, బంగ్లాలో నెంబర్ 1గా!

Major Movie Rocking in Netflix: అడవి శేష్ హీరోగా రూపొందిన మేజర్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ లో అసువులు బాసిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. చూసిన ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ నటించగా ఆయన సరసన ఇషా అనే పాత్రలో సాయి మంజ్రేకర్ నటించింది. ఇక శోభిత ధూళిపాల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి సందీప్ తల్లిదండ్రుల పాత్రల్లో నటించారు. 

ఇక సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్ తో మహేష్ బాబు తన సొంత బ్యానర్ ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. జూన్ మూడో తేదీన తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పట్టారు. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా మార్కెట్ చేసిన దానికంటే రెట్టింపు వసూలు చేసి మరోసారి తెలుగు సత్తా చాటినట్లు అయింది. 

ప్రస్తుతానికి ఈ సినిమా డిజిటల్ వేదికగా ప్రస్తుతం అందరి ఇళ్లలోనూ సందడి చేస్తోంది. జూలై మూడు నుంచి ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషలలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. వెండి తెరపై సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు బుల్లితెరపై కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఈ వారానికి సంబంధించి నెట్ ఫ్లిక్స్ టాప్ టెన్ ట్రెండింగ్ సినిమాల లిస్టులో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. 

హిందీ వర్షన్ మొదటి స్థానంలో నిలవగా తెలుగు వర్షన్ రెండో స్థానంలో నిలిచిందని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. కేవలం ఇండియాలోనే కాదు పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంటున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది. నిజానికి పాక్ నుంచి వచ్చిన టెర్రరిస్టులే ముంబైలో విధ్వంసం సృష్టించారు. అలాంటిది ఆ దేశంలో కూడా ట్రెండ్ అవడం గమనార్హం. ఆయా దేశాల్లో నెట్ ఫ్లిక్స్ స్టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లిస్టులో మేజర్ మొదటి స్థానం సాధించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అడవి శేష్ కూడా తన సోషల్ మీడియా వేదికగా ఈ సంతోషకర న్యూస్ షేర్ చేసుకున్నారు.

Also Read: Hero Vikram Heart Attack: హీరో విక్రమ్ కు తీవ్ర అస్వస్థత.. గుండెపోటుతో హాస్పిటల్ కు!

Also Read: Sivaji Ganesan: శివాజీ కుటుంబంలో వివాదం.. ప్రభు, విక్రమ ప్రభు సహా మరో కుమారుడిపై కోర్టు కేసు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News