Adah Sharma: బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎటువంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  2020లో ఆత్మహత్య చేసుకొని ఆయన మరణించడం ఇండస్ట్రీని ఒక్కసారిగా కలచివేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా మరోవైపు సుశాంత్ మరణించి నాలుగేళ్లయిన ఆయన ఫ్లాట్ ఇప్పటికీ ఖాళీగానే ఉన్నట్లు సమాచారం.. అయితే ఇప్పుడు ఆ ఫ్లాట్ లోకి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడకపోవడంతోనే అది ఖాళీగా ఉంది. కానీ తాజాగా ఆ ఫ్లాట్లోకి ప్రముఖ బ్యూటీ అదా శర్మ దిగినట్లు సమాచారం. 


గత కొంతకాలంగా నటి అదా శర్మ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట్లో నివసించడం మొదలుపెట్టారట. తనకు నచ్చింది కాబట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఆమె విపరీతమైన ట్రోల్ కూడా ఎదుర్కొంది.  చాలామంది ఆమెపై రక రకాల కామెంట్లు కూడా చేశారు. అయితే ప్రజలు ఎవరు ఏం చెప్పినా తాను నమ్మనని , అసలు పట్టించుకోనని,  తన నిర్ణయం పట్ల తాను సంతోషంగా ఉన్నానని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 


అదా శర్మ మాట్లాడుతూ.. నేను , సుశాంత్ ఇంట్లో ఉంటున్నాను. అది ప్రజలకు నచ్చకపోయినా నాకు నచ్చింది. అది నా ఇష్టం అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇంటర్వ్యూలో భాగంగా..ఆ ఇంట్లో నివసిస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా సుశాంత్ ఉనికిని ఫీలయ్యారా..? అని అడగ్గా దానికి .. అవును ఆయన నా పక్కనే ఉన్నట్లు అనిపించింది.. అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 



ముఖ్యంగా భయానక అనుభవాల గురించి ప్రజలు తరచుగా అడుగుతూ ఉంటారు. వాటన్నింటినీ పక్కన పెట్టండి. ఆయనను ఒక మనిషిగా ఫీల్ అవ్వండి. సుశాంత్ చాలా ప్రతిభావంతుడైన నటుడు. ఆయన చేసిన పాత్రలను గుర్తు తెచ్చుకోవాలి .ఆయన ఇంటర్వ్యూలు వినాలి .అప్పుడు ఆయన చెప్పిన విషయాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది ఆదాశర్మ.



 ఇకపోతే సుశాంత్  ఇల్లు తనకు చాలా నచ్చిందని,  ఆ ఇంటి చుట్టుపక్కల ఎన్నో చెట్లు ఉన్నాయని కూడా ఆమె తెలిపింది.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట్లో అద్దెకు దిగి పైగా ఆయనను ఫీల్ అవుతున్నానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా ఈమె డేర్ కి అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.


Read more: Baba Siddique: బాబా సిద్ధీఖీ ఎవరు?... ఎన్సీపీ నేత హత్యకు నెల రోజుల ముందు నుంచి అంత జరిగిందా..?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.