Thriller Actress Apsara Rani | కరోనా వైరస్ వ్యాప్తి భయంతో మిగతా డైరెక్టర్లు, నటీనటులు భయంతో వణికిపోతుంటే.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మాత్రం సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లోనే క్లైమాక్స్, నగ్నం (Naked) మూవీలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేశారు. వీటి సక్సెస్‌తో మారో మూవీ థ్రిల్లర్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు దర్శకుడు ఆర్జీవీ తెలిపాడు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో కొత్త హీరోయిన్ అప్సర రాణి (Apsara Rani) అని పరిచయం చేశాడు. థ్రిల్లర్ మూవీలో లీడ్ రోల్ అని, ఆమె ఒడిశాలో పుట్టిందని ట్వీ్ట్ చేశాడు. డెహ్రాడూన్‌లో అప్సర రాణి పెరిగిందని పలు విషయాలు చెప్పాడు. 1999కు తుఫాన్‌కు ముందు తాను ఒడిశా పేరు వినలేదని, అయితే అప్సర రాణిని చూసిన తర్వాత ఒడిశాలో తుఫానులు ఎందుకు వస్తాయో తెలిసిందంటూ వర్మ చమత్కరించాడు. RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్


తన హీరోయిన్‌ను పరిచయం చేసిన వర్మ అంతటితో ఆగుతాడా. ఆమె హాట్ ఫొటోల (Apsara Rani Hot Photos)ను సైతం నెటిజన్లకు అందిస్తూ తన థ్రిల్లర్ సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ సోషల్ మీడియాలోనే చేసేస్తున్నాడు. అప్సర రాణి మంచి డ్యాన్సర్, నటి అని మరో ట్వీట్‌లో తన కొత్త హీరోయిన్‌ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆకాశానికెత్తేశాడు. RGV: వర్మపై ప్రణయ్ తండ్రి ఫిర్యాదు..కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు


కాగా, మరోవైపు దర్శకుడు వర్మ.. కొన్ని నిజజీవిత అంశాల ఆధారంగా ‘మర్డర్’ అనే సనిమాను, మరో హారర్ థ్రిల్లర్ కథాంశంతో ‘12 ఓ క్లాక్’ సినిమాలతో బిజీగా ఉన్న వర్మ ఆసక్తికరంగా ఓ హాట్ హీరోయిన్‌తో థ్రిల్లర్ మూవీ ప్లాన్ చేశాడు. పవర్ స్టార్ సినిమాను సైతం తెరకెక్కించనున్నట్లు ఇటీవల వర్మ ప్రకటించాడు. ప్రస్తుతానికి పవర్ స్టార్ ప్రాజెక్టును పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..