Asin divorce Rumors: `ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..`: నటి ఆసిన్
Asin divorce Rumors: తన భర్త రాహుల్ శర్మతో విడిపోతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆసిన్ అన్నారు. సోషల్ మీడియా వేదిక జరుగుతోన్న ఈ రూమర్స్ పై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చారు.
Asin divorce Rumors: గజినీ సినిమాతో దేశాన్ని ఊపేసిన నటి ఆసిన్ (Asin). వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది ఈ బ్యూటీ. కానీ ఈ అమ్మడు మాత్రం వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఆసిన్, తన భర్త రాహుల్ శర్మ విడిపోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా ఆసిన్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.
''ప్రస్తుతం తాను రాహుల్‌తో కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నానని.. ఈ తరుణంలో కొన్ని నిరాధారమైన వార్తలు మా కంట పడ్డాయి. పెళ్లి కోసం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించిన ఆనాటి రోజులు మాకు గుర్తుకు వచ్చాయి. మేమిద్దరం విడిపోయామంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి వార్తలు రాసేటప్పుడు ఆలోచించి రాయండి. అద్భుతమైన హాలీడేలో ఇలాంటి వాటి కోసం ఐదు నిమిషాలు కేటాయించాల్సి వచ్చినందుకు చింతిస్తున్నా''’ అని ఆసిన్ పోస్ట్ పెట్టారు.
Also Read: Prithviraj Sukumaran: షూటింగ్‌లో గాయపడ్డ 'పృథ్వీరాజ్' .. టెన్షన్ లో సలార్ టీమ్?
దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో ఆసిన్ ఒకరు. ‘''అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అక్కడ నుంచి ఈ బ్యూటీ వరుస విజయాలతో దూసుకుపోయింది. శివమణి, గజినీ, ఘర్షణ, పోకిరి (తమిళ వెర్షన్), మజా, దశావతారం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో కూడా హౌస్‌ఫుల్ 2’, ‘లండన్ డ్రీమ్స్ అనే చిత్రాల్లో మెరిసింది ఆసిన్. ఈ క్రమంలోనే మైక్రోమ్యాక్స్ ఫౌండర్ రాహుల్ శర్మతో ఆమె ప్రేమలో పడ్డారు. 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Also Read: Tamannaah Bhatia: ఫ్యాన్ చేసిన పనికి కంటతడి పెట్టుకున్న తమన్నా, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి