ముంబై: 'దమ్ లగాకే హైషా'  మూవీతో  బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నటి భూమి పెడ్నేకర్. 2017లో అక్షర్ కుమార్ సరసన నటించిన ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ’ ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ఎక్కువ శాతం సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించే ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా న్యూడ్ ఫొటోషూట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన టాప్ లెస్ ఫొటో చూసిన ఫ్యాన్స్  ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఈ ఫొటో చూస్తే 'దమ్ లగాకే హైషా' సినిమా హీరోయిన్ ఈమెనే అని గుర్తించలేనట్లు ఉంది భూమి పెడ్నేకర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

See Pics: అందాల గేట్లు ఎత్తేసిన భామలు


Also Read; ఆ హీరోయిన్ వచ్చిన వేళా విశేషం.. నితిన్‌కు పెళ్లి!


బాలీవుడ్ ఫేమస్ ఫొటోగ్రాఫర్ డబ్బు రత్నాని క్యాలెండర్ కోసం హీరోహీరోయిన్ల ఫొటోషూట్ చేశాడు. ఇందులో భాగంగా భూమి పెడ్నేకర్ ఫొటోలు క్లిక్ మనిపించాడు. వీటిలో ఓ ఫొటోను హీరోయిన్ తన సోషల్ మీడియాలో ఫాలోయర్లతో షేర్ చేసుకున్నారు. గ్లామర్ కన్నా కథకు, విషయానికే ప్రాధాన్యమిస్తూ సంప్రదాయంగా కనిపించే భూమి పెడ్నేకర్ ఇలాంటి ఫొటోలు కూడా పోస్ట్ చేస్తారా అని అభిమానులు స్పందిస్తున్నారు. డబ్బు రత్నాని క్యాలెండర్ కోసం అభిమానులు మాత్రమే కాదు బాలీవుడ్ అగ్రతారలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.


Also Read: మలైకా అరోరా, అర్జున్ రిలేషన్ దెబ్బకొట్టింది!



డబ్బు రత్నాని చేసిన క్యాలెండర్‌లో భూమి పెడ్నేకర్‌తో పాటు అక్షయ్ కుమార్, విద్యాబాలన్, అనన్య పాండే, షెర్లిన్ చోప్రా, కియారా అద్వానీ, సన్నీ లియోన్, టైగర్ ష్రాఫ్, కృతి సనన్ లాంటి అగ్రతారలు కనిపించనున్నారు. భూమి ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. 


Also Read: రీఎంట్రీపై మంచు మనోజ్ అప్‌డేట్.. భావోద్వేగంతో ట్వీట్


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..