బాలీవుడ్‌ ఇండస్ట్రీని విషాదాలు కుదిపేస్తున్నాయి. నటీనటుల వరుస మరణాలు ఈ ఏడాది హిందీ చిత్ర పరిశ్రమను కలిచివేస్తున్నాయి. గత నెలలో టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని ఇంకా జీర్ణించుకోకముందే ఆదివారం మరో నటుడు రంజన్ సెహగల్ మరణించారు. అంతలోనే బాలీవుడ్ మరో చేదు వార్తను వినాల్సి వచ్చింది. ప్రముఖ మోడల్, నటి దివ్య చౌక్సీ (Divya Chouksey Passes Away) మృతిచెందింది. ఐశ్వర్యరాయ్‌కి కరోనా పాజిటివ్, జయా బచ్చన్‌కు నెగటివ్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీర్ఘకాలం నుంచి కేన్సర్ మహమ్మారితో పోరాడుతున్న దివ్య చౌక్సీ(29) ఆదివారం తుదిశ్వాస (Divya Chouksey Dies) విడిచింది. ఆమె బంధువు బంధువు సౌమ్య అమిష్ వర్మ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలుపుతూ సంతాపం ప్రకటించింది. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. దివ్య చౌక్సీ మరణంపై బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. ‘హై అప్నా దిల్ తో అవారా’ నటి  మరణం పట్ల సంతాపం తెలుపుతూ, దివ్య చౌక్సీ (Divya Chouksey) ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.   వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


‘‘నెలల తరబడి నేను కేన్సర్‌తో పోరాడుతున్నాను. నా జీవితం చివరి దశలో ఉంది. నేను ప్రస్తుతం మరణశయ్యపై ఉన్నాను. ఏదైనా జరగవచ్చు. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. దేవుడికి అంతా తెలుసు. ఇలాంటి బాధ లేని మరో జీవితం ఉంటుందని ఆశిస్తున్నాను. డీసీ బై’ అంటూ ఆమె చేసిన చివరి పోస్ట్ వైరల్ అవుతోంది. దివ్య చౌక్సీ పలు యాడ్ ఫిల్మ్స్‌తో పాటు టెలివిజన్ షోలలో పాల్గొని సందడి చేసింది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..