Snake bite: నాగు పాముకు చుక్కలు చూపించిన తాబేలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Snake Attacks on Turtle: పాము తన మానాన తాను ఒక పక్కన ఉంది. ఇంతలో ఒక బుజ్జి తాబేలు పామును చూసింది. మెల్లగా కదులుతూ పాము దగ్గరకు వెళ్లింది. అప్పటికే బుస్ బుస్ మంటూ దానికి వార్నింగ్ ఇచ్చింది. ఇంతలో ఒక ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 4, 2024, 03:28 PM IST
  • పాముకు షాక్ ఇచ్చిన తాబేలు..
  • ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
Snake bite: నాగు పాముకు చుక్కలు చూపించిన తాబేలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

cobra biting a turtle and see what happened next here video: పాములంటే ప్రతిఒక్కరు భయంతో వణికిపోతుంటారు. కొందరైతే పాముల పేరు చెప్పడానికి కూడా అస్సలు ఇష్టపడరు. రాత్రి పూట ఎక్కడ పాము వస్తుందో అని జాగ్రత్తగా ఉంటారు. చెట్లు, గుబురుగా ఉండే ప్రదేశాలకు వెళ్లడానికి అస్సలు ఇష్టపడరు.ఈ నేపథ్యంలో పాములు ఎలుకల వేటలో మనుషుల ఇళ్లకు వస్తుంటాయి. వడ్లు, బియ్యం బస్తాలు ఉండే చోట ఎలుకలు ఉంటాయి. వీటిని తినేందుకు పాములు వస్తుంటాయి. పాములు కన్పిస్తే చాలా మంది భయంతో పారిపోయి, స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. మరికొందరు మాత్రం.. పాములను హనీ తలపెడుతుంటారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by India YaTra (@india.yatra)

పాములకు ఇబ్బందులు తలపెడితే.. సర్పదోషంకల్గుతుందిన కూడా చాలా మంది భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని వీడియోలు షాకింగ్ కు గురిచేసేవిలా ఉంటే, మరికొన్ని మాత్రం చూస్తేనేభయం కల్గించేవిగాను ఉంటాయి. పాముల వీడియోలు చూడటానికి నెటిజన్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. అచ్చం ఈ కోవకు చెందిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పూర్తి వివరాలు..

విషపూరితమైన పాముల గురించి అనేక ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొందరు పాములను మెడలో వేసుకుంటారు. పాములకు స్నానం చేయిస్తుంటారు. పాములను బెడ్ ల మీద, తమ ఇళ్లలో కూడా పెట్టుకుంటారు. పాముల కోసం ప్రత్యేకంగా ర్యాక్ లను కూడా కొందరు మెయింటెన్ చేస్తుంటారు. పాములు.. వాటిని ఎవరైన ఆపద కల్గిస్తారని అనుమానం వస్తేనే దాడిచేస్తుందంట. మొదట పాము బుస్ బుస్ అంటూ అలర్ట్ ఇస్తుందంట. దీన్నిగమనించి దూరంగానే ఉండాలి. కానీ కాదూ.. కూడదంటూ.. దగ్గరకు వెళ్తే మాత్రం కాటు వేయడం పక్కా. అయితే.. ఇక్కడ ఒక తాబేలు పామును చూసింది. నా డిప్ప స్ట్రాంగ్.. పాముతో నాకేంటీ అనుకుందో ఏంటోకానీ.. మెల్లగా పాము దగ్గరకు వెళ్లింది.

పాము అప్పటికే కాస్త వెనక్కుజరిగింది. తాబేలు అయిన కూడా పాము దగ్గరకు వెళ్లడంతో,వెంటనే కోపంతో కాటు వేసింది. ఈ పరిణామంతో తాబేలు.. ఒక్క సారిగా చాకచక్యంగా ప్రవర్తించింది. పాము కాటేసే గ్యాప్ లో తన మూతిని డిప్పలోపలికి తీసుకుంది. దీంతో దాని కాటు డిప్పమీద పడింది. తాబేలు డిప్ప చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని విషయం తెలసిందే.

సింహం కూడా తాబేలు డిప్పను బ్రేక్ చేయడానికి నానా తిప్పలు పడుతుంది. మరీ తాబేలు కూడా పాము తననేం చేస్తుందని అనుకుందో కానీ.. దానికి చుక్కలు చూపించింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీనిపై నెటిజన్లు ..‘‘తాబేలు డిప్ప ముందు పాము ఆటలు బలాదూర్..’’.. అంటూ కొందరు, ‘‘తాబేలా మజాకా’’.. అంటూ మరికొందరు,వెరైటీగా కామెంట్లు చేస్తున్నారు. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x