గతేడాది జవనరిలో ప్రముఖ ర్యాపర్, సింగర్ నోయల్ సీన్ (Singer Noel Divorced), నటి ఎస్తర్ నొరొన్హ (Actress Esther) వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని అడుగుపెట్టారు. కానీ పెళ్లయిన ఆరు నెలలకే మనస్పర్థల కారణంగా విడివిడిగా ఉంటున్నారు. విడాకుల కోసం అప్లై చేసుకోగా.. ఇటీవల కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. మొన్న సింగర్ నోయల్ తమ విడాకుల విషయాన్ని వెల్లడించగా, ఆ మరుసటి రోజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో హీరోయిన్ ఎస్తర్ (Esther Divorced) అధికారికంగా తెలియజేసింది. Chiranjeevi: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మృతిపై స్పందించిన చిరంజీవి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంతో భావోద్వేగానికి లోనవుతూ ఎస్తర్ ఈ పోస్ట్ చేసింది. ‘ఏడాది నుంచి ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు వేశారు. వాటన్నింటికి ఇప్పుడు సమాధానం దొరికింది.  చట్టప్రకారం స్పష్టత రావాలని వేచిచూశాను. నేను, నోయల్ విడాకులు తీసుకున్నాం. 2019 జనవరిలో మేం పెళ్లి చేసుకున్నాం. కానీ కొంతకాలానికే మా మధ్య మనస్పర్థలు రావడంతో వేరువేరుగా ఉంటున్నాం. పరస్పర అంగీకారంతో గతేడాది జూన్‌లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. ఇన్ని రోజుల తర్వాత విడాకులు మంజూరయ్యాయి. పవన్ కల్యాణ్ బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసింది..



అందరిలాగ మేం సాధారణ మనుషులమే. మా జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదురయ్యాయి. గతంలోలాగే మీ అందరి మద్దతు నాకు అవసరం. మేం ఇద్దరం చర్చించుకుని తీసుకున్న కీలక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ మా విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. మరెక్కడా దీనిపై చర్చలు, ప్రశ్నలు వేయకుండా ఆశిస్తున్నానంటూ’ నటి ఎస్తర్ భావోద్వేగంతో పోస్ట్ చేస్తూ విడాకుల వివరాలు వివరించింది. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics


కాగా, ఇదివరకే సింగర్ నోయల్ తమ విడాకుల విషయాన్ని వెల్లడించాడు. ‘మేం మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నాం. మా విడాకుల విషయంలో ఎస్తర్‌ను గానీ, మా కుటుంబాన్నిగానీ ఎవరూ ఇబ్బంది పెట్టవద్దు. ఎస్తర్.. నీ కలలు నిజం కావాలని కోరుకుంటున్నా. నాకు ఈ విషయంలో మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు’ అంటూ సింగర్ నోయల్ పోస్ట్ చేయడం తెలిసిందే. Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్ 
 Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక 
Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ