Chiranjeevi: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మృతిపై స్పందించిన చిరంజీవి

Chiranjeevi reaction on Pawan Kalyan fans death | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు బ్యానర్ ఏర్పాట్లు చేస్తుండగా ముగ్గురు ఫ్యాన్స్ చనిపోవడం తెలిసిందే. పవన్ కల్యాణ్ అభిమానుల మరణంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

Last Updated : Sep 2, 2020, 11:13 AM IST
Chiranjeevi: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మృతిపై స్పందించిన చిరంజీవి

తమ అభిమాన నటుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు బ్యానర్ ఏర్పాట్లు చేస్తుండగా ముగ్గురు ఫ్యాన్స్ చనిపోవడం తెలిసిందే. కరెంట్ షాక్‌కు గురై పవన్ అభిమానులు మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పుం సమీపంలోని శాంతిపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ అభిమానుల మరణంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ ఘటన తనను కలచివేసిందని, మీ కుటుంబానికి మీరే సర్వస్వమని గుర్తుంచుకోవాలన్నారు. Happy Birthday Pawan Kalyan: పవన్ కల్యాణ్ బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసింది..

‘చిత్తూర్ లో పవన్ birthday కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో  ముగ్గురు  మరణించటం గుండెను  కలిచివేసింది. వారి  కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు  ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వమని’ మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. Pawan Kalyan birthday: పవన్ ఫ్యాన్స్‌కు ‘తీన్‌మార్’ సర్‌ప్రైజ్ 
Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్ 

 Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక 
Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ 

Trending News