Fatima Sana Shaikh about sexual abuse and casting couch: అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'దంగల్' సినిమాలో రెజ్ల‌ర్‌ గీతా ఫోగట్ పాత్రలో నటించిన ఫాతిమా సనా షేక్‌ తనకు మూడేళ్ల ప్రాయంలోనే లైంగిక వేధింపులు ఎదుర్కొందట. ఈ విషయాన్ని స్వయంగా ఫాతిమానే వెల్లడించింది. తాజాగా పింక్‌విల్లా.కామ్‌కు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో తన జీవితంలోని అనేక ఆసక్తికరమైన అనుభవాలు పంచుకున్న ఫాతిమా స‌నా షేక్.. తన జీవితంలోనూ మర్చిపోలేని భయంకరమైన అనుభవాలు ఉన్నాయంటూ మూడేళ్ల వయస్సులోనే వేధింపులకు ( Sexual harassments ) గురైన వైనాన్ని వెల్లడించింది. లైంగిక వేధింపుల విషయానికొస్తే.. మహిళలు ఆ విషయం ఎత్తడానికే భయపడతారని.. అటువంటి విషయాలు ప్రస్తావించొద్దనే ప్రపంచంలో మనం బతుకీడుస్తున్నామని ఫాతిమా సనా షేక్ అసహనం వ్యక్తంచేసింది. అందుకే మహిళలు ఎవ్వరూ ధైర్యంగా లైంగిక వేధింపుల గురించి మాట్లాడరు అని చెప్పుకొచ్చింది. Also read : Bhumika in Anasuya's place: యాంకర్ అనసూయ స్థానంలో భూమిక


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు ధైర్యంగా బయటికి వచ్చి తమ గొంతు వినిపించేలా వారిలో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఫాతిమా అభిప్రాయపడింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్‌ను ( Casting Couch ) బాధితురాలినే అని చెప్పిన ఫాతిమ.. సెక్స్‌కు అంగీక‌రించ‌పోతే అవకాశాలు కూడా లభించని దుస్థితి  లేకపోలేదని అన్నారు. ఇంకొన్నిసార్లు తనకు వచ్చిన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌న్నారు. Also read : Kajal Aggarwal ties knot: గౌతం కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్


ప్ర‌స్తుతం లుడో ( Ludo ), సూర‌జ్ పే మంగ‌ల్ భ‌రీ ( Suraj Pe Mangal Bhari ) సినిమాల్లో నటిస్తోన్న ఫాతిమా సనా షేక్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అటు సినీ పరిశ్రమలో ఇటు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. Also read : Sai Pallavi, Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ సరసన సాయి పల్లవి ?