Sai Pallavi, Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ సరసన సాయి పల్లవి ?

Sai Pallavi in Pawan Kalyan's next movie: పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో సాగర్‌చంద్ర డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' మూవీకి తెలుగు రీమేక్‌గా ( ayyappanum koshiyum Telugu remake movie ) తెరకెక్కనున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది.

Last Updated : Oct 31, 2020, 03:56 AM IST
Sai Pallavi, Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ సరసన సాయి పల్లవి ?

Sai Pallavi in Pawan Kalyan's next movie: పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో సాగర్‌చంద్ర డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' మూవీకి తెలుగు రీమేక్‌గా ( ayyappanum koshiyum Telugu remake movie ) తెరకెక్కనున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ ( Pawan Kalyan )‌ ఓ పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. గబ్బర్ సింగ్ మూవీ తర్వాత పవర్ స్టార్ మళ్లీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్న సినిమా ఇదే. Also read : Bhumika in Anasuya's place: యాంకర్ అనసూయ స్థానంలో భూమిక

అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమా మళయాళం వెర్షన్‌లో బిజూమీనన్‌ ( Biju Menon ) పోలీస్‌ అధికారి పాత్రలో నటించగా ఆయన భార్య పాత్రలో గౌరీనందా ( Gauri Nanda ) కనిపించింది. అభ్యుదయ భావాలు కలిగిన యువతిగా గౌరీనందా పోషించిన పాత్రకు సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే లభించాయి. మళయాళంలో గౌరినందా నటించిన ఆ పాత్ర కోసం తెలుగు వెర్షన్‌లో సాయిపల్లవిని ( Actress Sai Pallavi ) ఎంపిక చేయబోతున్నట్లు ఫిలింనగర్ టాక్. అదే కానీ నిజమైతే.. పవన్ కల్యాణ్‌కి జంటగా మళయాళం ముద్దుగుమ్మ సాయిపల్లవి కనిపించే అవకాశాలున్నాయి. ఐతే దీనిపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. Also read : Kajal Aggarwal ties knot: గౌతం కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్

sai-pallavi-in-pawan-kalyan-movie-Ayyappanum-koshiyum-Telugu-remake

మళయాళం వెర్షన్‌లో అక్కడి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ( Prithviraj Sukumaran ) మరో ముఖ్య పాత్ర పోషించాడు. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు జాన్ అబ్రహం (  John Abraham ) గతంలోనే ప్రకటించాడు. జేఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు జాన్ అబ్రహం మే నెలలోనే ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఐతే లాక్ డౌన్ కారణంగా హిందీ రీమేక్ వెర్షన్ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. Also read : Punarnavi Bhupalam: పునర్నవి భూపాలం ఎంగేజ్మెంట్ కాలేదు.. మరి రఘునందన్ ఎవరు ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News