Kajal Aggarwal ties knot with Gautam Kitchlu: ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతం కిచ్లును పెళ్లి చేసుకుంది. ముంబైలోని తాజ్ హోటల్లో ఈ పెళ్లి వేడుక జరిగింది. కాజల్ అగర్వాల్, గౌతం కిచ్లు కుటుంబాల వైపు నుంచి అత్యంత సన్నిహిత బంధుమిత్రులు ఈ వివాహానికి హాజరయ్యారు. కొవిడ్-19 వ్యాప్తి ( COVID-19 protocol) నేపథ్యంలో అందరినీ ఈ వివాహానికి ఆహ్వానించనప్పటికీ.. అత్యంత సన్నిహితులు, బంధువులతోనే కాజల్ పెళ్లి వేడుకలో భారీ సందడి కనిపించింది. Also read : Kajal Aggarwal: హల్ది వేడుకలో దుమ్మురేపిన కాజల్ అగర్వాల్
Happy couple! #KajalAggarwal and #GautamKitchlu snapped during their wedding ceremony. pic.twitter.com/S83Qygt689
— Filmfare (@filmfare) October 30, 2020
మొత్తానికి టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, ఆమె బాయ్ ఫ్రెండ్ గౌతం కిచ్లు ఈ పెళ్లితో ఒక్కటై ఒక ఇంటివారయ్యారన్నమాట. కాజల్ అగర్వాల్ పెళ్లికి ముందుగా జరిగిన హల్దీ సెరెమనీలో ( Kajal Aggarwal haldi ceremony photos) ఆమె ఎంజాయ్ చేస్తూ చేసిన డ్యాన్సింగ్ వీడియోలు, ఫోటోలకు ఇచ్చిన ఫోజులు వైరల్ అయిన సంగతి తెలిసిందే. Also read : Punarnavi Bhupalam: పునర్నవి భూపాలం ఎంగేజ్మెంట్ కాలేదు.. మరి రఘునందన్ ఎవరు ?
అలాగే ఈ పెళ్లి వేడుకకు వేదికైన తాజ్ హోటల్లో గౌతం కిచ్లు కూడా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కెమెరాలకు ఫోజిస్తూ కనిపించాడు.
తాజ్ హోటల్ బాల్కానీలో గౌతం కిచ్లు ఫోటో సెషన్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ( Gautam Kitchlu photos ) సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe