Actress Hema: సురేఖ ఓర్వలేకపోయింది.. నా గురించి ఆ మాటలు కూడా.. ఆరోపణలు గుప్పించిన హేమ!
Actress Hema Sensational Allegations on Surekha Vani: ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేఖ వాణిని ఉద్దేశిస్తూ హేమ చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి.
Actress Hema Sensational Allegations on Surekha Vani: సురేఖ వాణి నటిగా ఎంత పాపులర్ అయిందో ఆమె కుమార్తె సుప్రీత కూడా సోషల్ మీడియాలో అంతే ఫేమస్ అయింది. వీరిద్దరూ తల్లి కూతుళ్ళా లేక అక్కాచెల్లెళ్ళా అని కూడా చాలామంది అనుమాన పడుతూ ఉంటారు. భర్త చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో సురేఖ వాణి బాగా యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతానికి సినిమాలలో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తుంది సురేఖా వాణి.
అయితే అలాంటి సురేఖా వాణిపై నటి హేమ ఆరోపణలు గుప్పించారు. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేఖను ఉద్దేశిస్తూ హేమ చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి. తన కుమార్తె ఈశా సురేఖ కుమార్తె సుప్రీత మంచి ఫ్రెండ్స్ అని అయితే వారి స్నేహం చూసి ఓర్వలేక సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతను స్కూల్ మార్పించిందని చెప్పుకొచ్చారు. సురేఖ వాణి నేను బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే మా ఇద్దరమ్మాయిలు కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు, ఎందుకో కానీ వారి స్నేహం చూసి ఓర్వలేక వాళ్ళని విడగొట్టాలని చూసి ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతుంటే సుప్రీతను వేరే స్కూల్లో చేర్పించిందని హేమ అన్నారు.
అయితే సుప్రీత బోల్డ్ కాబట్టి తల్లి ప్రయత్నాన్ని అర్థం చేసుకొని మళ్లీ తన స్నేహితురాలు చదువుతున్న స్కూల్ కే వెనక్కి వచ్చేసిందని హేమ అన్నారు. సురేఖ వాణి షూటింగ్ సెట్స్ లో నా గురించి వేరే వాళ్లకు తప్పుగా చెప్పేదని ఇవన్నీ తెలిసి ఆమెను కలవడం మానేశానని హేమ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నేను ఆమెకు దూరంగా ఉంటున్నానని హేమ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే సురేఖా వాణి హేమ కామెంట్స్ కు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Rajamouli: దర్శకధీరుడికి అరుదైన అవకాశం.. టాలీవుడ్ నుంచి మొదటి వ్యక్తిగా!
Also Read: Arya Ghare: స్మశానంలో నటి బర్త్ డే సెలబ్రేషన్స్.. పైత్యం కాదండోయ్.. ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.