Actress Arya Ghare Birthday Celebration in Graveyard: సాధారణంగా పుట్టినరోజు వేడుకలు అనేవి జీవితంలో చాలా ముఖ్యమైనవి అని కొందరు భవిస్తూ ఉంటారు. తమ తమ ఆర్ధిక స్థితిగతులను బట్టి ఎవరికి వారు పుట్టినరోజు వేడుకలు ఇళ్లలో, హోటల్స్ లో లేదా హైదరాబాద్ పబ్లిక్ అయితే ట్యాంక్ బండ్ మీద జరుపుకుంటూ ఉంటారు. అయితే ఒక నటి మాత్రం ఏకంగా స్మశానంలో జరుపుకుని షాక్ ఇచ్చింది. అదేంటి ఆమెకు ఏమైనా పిచ్చా? పైత్యమా? అని మీరు అనుకోవచ్చు కానీ ఆమె అలా చేయడానికి ఒక మంచి కారణమే ఉంది.
అసలు విషయం ఏమిటంటే నాగ్‌పూర్‌లో కొద్దిరోజుల మూఢనమ్మకాలకి సంబందించిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల బాలికకు దెయ్యం పట్టిందని అనుమానించిన ఆమె తల్లిదండ్రులు దెయ్యాల బారి నుండి విడిపించే పేరుతో తీవ్రంగా కొట్టడంతో ఆరేళ్ల బాలిక దెబ్బలకు తాళలేక మృతి చెందింది. ఈ దారుణ ఘటన మొత్తం మహారాష్ట్రను పట్టి కుదిపేసింది. ఈ దారుణ ఘటనపై ఎవరికి వారు తమకు తోచిన విధంగా నిరసనలు తెలిపారు.
ఇక దెయ్యాలు, భూతాలూ లాంటివి లేవు అవన్నీ మన మూఢ నమ్మకాలు అని అవగాహన కల్పించడం కోసం మరాఠీ నటి తన పుట్టినరోజును స్మశానవాటికలో జరుపుకుని షాకిచ్చింది. అనేక మరాఠీ సినిమాల్లో నటిగా సత్తా చాటిన మరాఠీ నటి ఆర్య ఘరే తన పుట్టినరోజును స్మశానవాటికలో జరుపుకున్నారు. సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు, వాటి కారణంగా చోటుచేసుకుంటున్న సంఘటనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్య వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగ్‌పూర్‌లో మూఢనమ్మకాలతో ఆరేళ్ల బాలిక చనిపోయిందని, అయినా సమాజం మూఢనమ్మకాలను ఎందుకు నమ్ముతోంది? విశ్వాసం మంచిదే కానీ అది అతి కాకూడదని అన్నారు.
స్మశాన వాటికల్లో దెయ్యాలు ఉన్నాయని చాలా మంది అంటారు అయితే నేను ఎవరి అభిప్రాయాన్ని తప్పుగా తీసుకోను కానీ ఇక్కడ దయ్యాలు ఉన్నాయని నేను అనుకోనని అన్నారు. ఎందుకంటే ఎవరైనా సరే వారు పేదవారైనా, ధనవంతులైనా చివరికి ఇక్కడకు రావలసిందే, అందరి అంతిమ గమ్యం స్మశానవాటికే అని ఆమె అన్నారు. అందుకే ఇక్కడే పుట్టినరోజు జరుపుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె పేర్కొన్నారు. ఇక యువత ముందుకు వచ్చి మూఢనమ్మకాలను విడనాడాలని, ఇది నా చిన్న ప్రయత్నం అని ఆమె వెల్లడించారు. నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేయడం లేదని అన్నారు.
Also Read: Raju Srivastava: విషమంగా కమెడియన్ ఆరోగ్య పరిస్థితి... ఇంకా వెంటిలేటర్ పైనే
Also Read: Actor Vishal: మరోసారి హీరో విశాల్ కు ప్రమాదం.. షూటింగ్లో తీవ్ర గాయాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.