Indraja in Sridevi Drama Company : ఒకప్పుడు హీరోయిన్ గా ఎందరో మనసులని దోచుకున్న ఇంద్రజ ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలకి జడ్జ్ గా వ్యవహరిస్తూ.. అందరిని ఆకట్టుకుంటున్నారు. బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ వంటి ఆర్టిస్టులతో.. ఆమె కూడా కలిసిపోయి ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే ఇంద్రజ.. లేటెస్ట్ గా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో కన్నీరుమున్నీరు అయ్యారు. మే 12న మదర్స్ డే సందర్భంగా.. మదర్స్ డే స్పెషల్ టీం తో ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షోని రూపొందించారు. దీనికి సంబంధించిన ప్రోమో ఈ మధ్యనే విడుదలైంది. ఇక ఈ ప్రోమో మొదట్లో సరదా సరదాగా సాగిన ఆ తర్వాత మాత్రం పూర్తి ఎమోషనల్ గా మారిపోయింది.


ఫైమా, అంజలి తదితరులు వారి తల్లులతో ఈ షోకి హాజరయ్యారు. గెటప్ శ్రీను కూడా తాను హీరోగా నటిస్తున్న రాజు యాదవ్ సినిమా ప్రమోషన్స్ కి ఈ ఎపిసోడ్ లో కనిపించారు. రష్మీ మమ్మీ వర్సెస్ డాటర్స్ అంటూ ఒక గేమ్ ని నిర్వహించింది. బుల్లెట్ భాస్కర్, ఇమాన్యుల్, నూకరాజు, పొట్టి నరేష్, వంటి కమెడియన్లు తాము అమ్మగా భావించే ఇంద్రజని సన్మానించారు. ఆమెకు ఒక్కొక్కళ్ళు ఒక్కో గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇచ్చారు. కాగా నూకరాజు ఆమెకు ఒక మంచి చీరని గిఫ్ట్ చేశారు. ఇక వారందరికీ ప్రేమ చూసి ఇంద్రజ ఎమోషనల్ అయిపోయారు. తన తల్లిని గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఎంతమంది ఉన్నా, ఎన్ని రిలేషన్ షిప్స్ ఉన్నా తల్లి, తండ్రి లేకపోతే అనాధలమే అవుతాము.. అని కంటతడి పెట్టుకున్నారు ఇంద్రజ. 



కన్న తల్లిదండ్రులకు ఏమి చేయకుండా.. ఊరంతా వెళ్లి.. వాళ్ళ కోసం ఎంత చేసినా ప్రయోజనం లేదు. ఆ విషయంలో నేను కూడా తప్పులు చేశాను అని.. తన తల్లి చివరికోరిక ను నెరవేర్చలేకపోయాను అని ఇంద్రజ ఏడ్చేశారు. "మా అమ్మ బతికున్నప్పుడు ఒక గుడికి తీసుకెళ్ళమని చాలాసార్లు అడిగింది. కానీ నేను ఆమె కోరిక తీర్చలేకపోయాను. మళ్లీ మా అమ్మ ఒక్కసారి కనిపిస్తే ఆమె కోరిక నెరవేర్చాలని ఉంది" అంటూ ఇంద్ర వెక్కివెక్కి ఏడ్చేసారు. ఆమెను చూసిన మిగతావారు కూడా కంటతడి పెట్టుకున్నారు.


Also read: Apple Watch Saves Life: ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈవో రెస్పాన్స్ ఏంటో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter