Jyotika: సోషల్‌ మీడియా వచ్చాక అభిమాన తారలు, అభిమానులకు చేరువయ్యారు. వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వారి దైనందిన జీవితం వంటివి తెలుస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం తారలు తమ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. వారితో సంభాషిస్తూ అనుబంధం పెంచుకుంటుంటారు. ఇలాగే ఓ సినీ తారకు ఓ నెటిజన్‌ సంచలన ప్రశ్న అడిగారు. దీనికి ఆమె అదే రీతిలో ఘాటుగా బదులిచ్చారు. ఆమెవరో కాదు సినీనటి జ్యోతిక. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Rakul Strong Counter: పెళ్లయితే పద్ధతిగా ఉండాలా? అందాలు దాచుకోవాలా? రకుల్‌ ప్రీత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌


తెలుగు, తమిళ ప్రజలకు జ్యోతిక సుపరిచితం. ఆమె భర్ సూపర్‌స్టార్‌ సూర్య అని కూడా తెలిసే ఉంటది. వారి అందమైన ప్రేమ కథ వివాహంగా మారి చక్కగా దశాబ్దాలుగా కొనసాగుతున్నది. అయితే ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా జ్యోతికకు ఓ అభిమాని వింత ప్రశ్న కోరారు. తన భర్త విషయమై అడిగారు. 'జ్యోతిక మేడమ్‌. సిల్లును ఒరు కాదల్‌ సినిమాలో మాదిరి మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా? పదిహేన్నేళ్లుగా సూర్యకు చాలా పెద్ద అభిమానిని' అని తర్సేనీ సూర్య అనే నెటిజన్‌ కామెంట్‌ చేసింది. అయితే ఆ కామెంట్‌ చాలా ఆసక్తికరంగా ఉండడంతో జ్యోతిక చూసి బదులిచ్చారు.

Also Read: Sreemukhi: చీరకట్టులో శ్రీముఖి హల్‌చల్‌.. ఇక చాలు ఆపు అంటున్న నెటిజన్లు


 


'హుఫ్‌.. అలాంటిదేం కుదరదు' అని జ్యోతిక రిప్లయ్‌ ఇచ్చింది. ఈ కామెంట్‌ వైరల్‌గా మారింది. జ్యోతిక రిప్లయ్‌కు నెటిజన్లు లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు. ఎవరైతో అడిగారో ఆ నెటిజన్‌ జ్యోతిక రిప్లయ్‌ చూసి ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా జ్యోతికకు ఆమెకు మధ్య సంభాషణ జరిగింది. 'దేవుడా.. ఓరి దేవుడా. మీరు నాకు బదులిచ్చారా? నమ్మలేకపోతున్నాం. నాకు సూర్య అంటే ఎంత ఇష్టమో మీకు తెలియదు. నా పేరు కూడా ఆయన పేరును పెట్టుకున్నా. అయినా మీ ప్రేమ ముందు నేను ఎంత? సూర్య ఎప్పటికీ మీ వాడే!' ఆ తర్సెనీ సూర్య అనే నెటిజన్‌ బదులిచ్చింది. దీనికి కూడా జ్యోతిక ఎమోజీల రూపంలో రిప్లయ్‌  ఇచ్చింది. ఇలా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇలా జ్యోతిక తరచూ తన అభిమానులతో సోషల్‌ మీడియాలో టచ్‌లో ఉంటారు.


ప్రస్తుతం జ్యోతిక ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఇటీవల అజయ్‌ దేవగణ్‌తో కలిసి 'షైతాన్‌' సినిమాలో నటించింది. ఇక భర్త సూర్య 'కంగువ' సినిమాతో బిజీగా ఉన్నారు. మొన్న విడుదలైన ఈ సినిమా టీజర్‌ ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా కన్నా పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter