Rakul Strong Counter: పెళ్లయితే పద్ధతిగా ఉండాలా? అందాలు దాచుకోవాలా? రకుల్‌ ప్రీత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Rakul Preet Singh Marriage Day: పెళ్లయి రెండు నెలలు కాలేదు.. అప్పుడే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన గ్లామర్‌ ప్రపంచంలోకి వచ్చింది. తాజాగా జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో అందాలు ఆరబోస్తూ హొయలు ఒలికింది. పెళ్లయ్యాక ఇలాంటివి చేయడంపై మీడియా ప్రశ్నించగా రకుల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 21, 2024, 07:51 PM IST
Rakul Strong Counter: పెళ్లయితే పద్ధతిగా ఉండాలా? అందాలు దాచుకోవాలా? రకుల్‌ ప్రీత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Rakul Preet Singh: నెల కిందట రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన ప్రియుడితో గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయి నెల కూడా దాటకముందే రకుల్‌ తన గ్లామర్‌ రంగంలోకి పునః ప్రవేశించింది. ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొని తన అందచందాలు ఆరబోసింది. ఆ షోలో రకుల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఫ్యాషన్‌ తక్కువ బట్టలతో మరింత అందంగా కనిపించింది. అయితే షో అనంతరం మీడియా 'పెళ్లి తర్వాత వస్త్రధారణ మార్చాలని ఇంట్లో వాళ్లు చెప్పలేదా?' అని మీడియా ప్రశ్నించగా.. రకుల్‌ చిర్రెత్తుకొచ్చింది. నవ్వుతూ సమాధానం చెబుతూనే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చి పడేసింది.

Also Read: Sreemukhi: చీరకట్టులో శ్రీముఖి హల్‌చల్‌.. ఇక చాలు ఆపు అంటున్న నెటిజన్లు

ముంబైలో లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు జరిగింది. ఈ ఫ్యాషన్‌ వీక్‌లో బాలీవుడ్‌ తారలు మెరిశారు. వారిలో రకుల్‌ ప్రీత్‌ కూడా ఉంది. సీతాకోకచిలుకలాంటి నలుపు తెలుపు రంగులోని జాకెట్‌.. జాలిలాగ ఉన్న నలుపు రంగు ఫ్రాగ్‌ వేసుకుని ఫ్యాషన్‌ షోలో మెరిసింది. ఈ డ్రెస్‌ను రితికా మిర్చందానీ కలెక్షన్స్‌ డిజైన్‌ చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'ఫ్యాషన్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది' అని తెలిపింది. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

Also Read: Kumari Aunty Movies: కుమారి ఆంటీ సంచలనం.. రెండు సినిమాలు తిరస్కరణ

'పెళ్లయ్యాక వస్త్రధారణలో మార్పులు చేసుకోవాలని ఎవరూ చెప్పలేదు. నా కుటుంబసభ్యులు, జాకీ (భర్త) కుటుంబం కూడా చెప్పలేదు. ఆ కుటుంబం పట్ల సంతోషం, గర్వంగా ఉన్నా. సమాజంలో పెళ్లిని చాలా పెద్ద విషయంగా చూస్తాం. కానీ ఎవరి జీవితంలోనైనా అది సహజమైనా ప్రక్రియ. పెళ్లయ్యాక అబ్బాయికి కూడా పలానా దుస్తులు ధరించాలని చెప్పగలరా? లేదు కదా' అని కౌంటర్‌ ఇచ్చింది. 'కాలం మారింది' అంటూ తెలిపింది. 'ఎవరికీ నచ్చిన విధంగా వారు ఉంటున్నారు' అని వెల్లడించింది.

నటుడు, నిర్మాత అయిన జక్కీ భగ్నానీతో ఈ ఏడాది ఫిబ్రవరి 21న రకుల్‌ ప్రీత్‌ వివాహం చేసుకున్న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గోవాలో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లయి మార్చి 21కి నెల పూర్తవడంతో రకుల్‌ ప్రీత్ సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. 'అప్పుడే నెల అయిపోయింది. సమయం అలా దూసుకెళ్తోంది. జీవితాంతం ఇలా డ్యాన్స్‌తో ముందుకెళ్దాం' అని పోస్టు చేసింది. జక్కా భగ్నానీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు చేశాడు. ఈ సందర్భంగా తన భార్య రకుల్‌ పొగుడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా తమ పెళ్లికి సంబంధించిన వీడియోను పంచుకున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News