దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో సైతం దేశ్యాప్తంగా రెండున్నర లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు పలు రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా 'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ కోవిడ్19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకుంది. టాలీవుడ్ నటి కీర్తి సురేష్ కరోనా వ్యాక్సిన్ తొలి తీసుకున్నారని ఫిల్మ్ జర్నలిస్ట్ పొన్మసెల్వన్ ట్వీట్ చేశాడు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కీర్తి సురేష్(Keerthy Suresh) మాట్లాడుతూ.. తన బాధ్యత తాను నిర్వర్తించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల దక్షిణాది సూపర్‌స్టార్ నయనతార, ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ కోవిడ్19 వ్యాక్సిన్ తీసుకున్నారు. సూది ఎక్కడమ్మా అంటూ నయనతార ఫొటోతో మీమ్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.


Also Read: Sarkau vaari Paata first look: సర్కార్ వారి పాట ఫస్ట్ లుక్ పోస్టర్ అప్‌డేట్స్



కాగా, కెరీర్ విషయానికొస్తే నటి కీర్తి సురేష్ టాలీవుడ్‌లో ప్రస్తుతం మహేష్ బాబు(Actor Mahesh Babu) సరసన సర్కారు వారి పాటలో నటిస్తోంది. గత ఏడాది నుంచి కరోనా వ్యాప్తి కారణంగా పలుమార్లు సినిమా షూటింగ్ వాయిదా పడింది. మరోవైపు కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన అన్నాత్తే మూవీలో నటిస్తోంది. రజనీకాంత్ తన షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లిపోయారు. ఆయన సైతం గత వారం కరోనా వ్యాక్సిన్ (Covid-19 Vaccine) తీసుకున్నారని తెలిసిందే.  


Also Read: Nayanthara Trolls: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నయనతారపై నెటిజన్ల ట్రోలింగ్, అసలు విషయం ఏంటంటే


మరోవైపు సెలబ్రిటీలకు కరోనా వ్యాక్సిన్లపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాలు కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కోవిడ్19 వ్యాక్సిన్ ఇస్తున్నాయని, అలాంటిది 45 ఏళ్లకు తక్కువగా ఉండే నటీనటులకు మాత్రం వ్యాక్సిన్ ఎలా దొరుకుతుందని సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సిన్ల కొరతతో కొన్ని రాష్ట్రాలు 45 ఏళ్లు పైబడిన వారికి సైతం తొలి డోసు కరోనా టీకాలు నిలిపివేశారు. కేవలం రెండో డోసు టీకాలు మాత్రమే ఇస్తున్నారు.


Also Read: India Corona Cases: భారత్‌లో 4 వేల దిగువకు COVID-19 మరణాలు, భారీగా డిశ్ఛార్జ్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook