Nayanthara Trolls: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నయనతారపై నెటిజన్ల ట్రోలింగ్, అసలు విషయం ఏంటంటే

Actress Nayanthara Trolled : నయనతారతో పాటు ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సైతం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. తాము వ్యాక్సిన్ తీసుకున్నామని, ఏ భయాలు లేకుండా కోవిడ్19 టీకాలు తీసుకోవాలని తమ అభిమానులకు, నెటిజన్లకు ఈ ప్రేమ పక్షులు పిలుపునిచ్చారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 20, 2021, 04:39 PM IST
  • కరోనా వైరస్ టీకాలు తీసుకున్న ప్రేమ పక్షులు నయనతార, విఘ్నేశ్ శివన్
  • చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్19 టీకా తొలి డోసు తీసుకున్నారు
  • ఇక అది మొదలుకుని హీరోయిన్ నయటనతారపై నెటిజన్స్ ట్రోలింగ్
Nayanthara Trolls: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నయనతారపై నెటిజన్ల ట్రోలింగ్, అసలు విషయం ఏంటంటే

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార కోవిడ్19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఇటీవల కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. నయనతారతో పాటు ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సైతం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. తాము వ్యాక్సిన్ తీసుకున్నామని, ఏ భయాలు లేకుండా కోవిడ్19 టీకాలు తీసుకోవాలని తమ అభిమానులకు, నెటిజన్లకు ఈ ప్రేమ పక్షులు పిలుపునిచ్చారు.

కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతన్నదని, మీరు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి, మీరు వ్యాక్సిన్ తీసుకుంటే ఇతరులకు సైతం కోవిడ్19 టీకాలు తీసుకోవాలని చెప్పాలని కోరింది. ఇక అది మొదలుకుని టాలీవుట్ నటి నయనతార(Actress Nayanthara)ను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.  నయనతార షేర్ చేసిన ఫొటోనే అందుకు కారణం. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం నయనతార, విఘ్నేశ్ శివన్ కరోనా టీకా తొలి డోసు తీసుకున్నాక షేర్ చేసుకున్న ఫొటోలో నయతారనకు టీకా ఇస్తున్న ఇంజెక్షన్ కనిపించడం లేదు. దాంతో నెటిజన్లు భూతద్దాలు, బైనాకులర్స్ సాయంతో వెతికినా తమకు ఇంజెక్షన్ కనిపించలేదట.

Also Read: NTR Birthday: అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం, కావాలంటే అప్పుడు వేడుక చేసుకుందామని ట్వీట్

నువ్వు కరోనా టీకా తీసుకున్నావు సరే, కానీ ఇంజెక్షన్ ఎక్కడ ఉంది నయనతార అంటూ నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆ ఫొటోలో నర్సు ఆమెకు టీకా ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. కానీ నర్సు చేతిలో ఎలాంటి ఇంజెక్షన్ కనిపించడం లేదు. మరోవైపు నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) దాంతో నెటిజన్లు నయనతార ఫొటోతో మీమ్స్ చేసి వైరల్ చేస్తున్నారు. మరోవైపు వెండితెరకు పరిచయమై 18 ఏళ్లు కావొస్తుంది. 2003లో మలయాళ సినిమా, 2005లో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలకు పరిచయమైంది. 

Also Read: Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ భామ Divi Vadthya క్యాబ్ స్టోరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది

సాధారణ నటిగా ఇండస్ట్రీకి వచ్చిన నయనతార అనతికాలంలోనే అగ్ర హీరోయిన్ అయ్యారు. లేడీ సూపర్ స్టార్ హోదా సైతం సొంతం చేసుకుంది. 2015 నుంచి నానున్ రౌడీ డాన్ సినిమా దర్వకుడు విఘ్నేశ్ శివన్‌తో డేటింగ్ చేస్తోంది. ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్లినా, చివర్లో అభిప్రాయభేదాలతో విడిపోయిన నయనతార ఆ తరువాత నుంచి కోలీవుడ్ దర్శకుడితో ప్రేమలో మునిగి తేలుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News