Actress Kriti Sanon tested Covid-19 positive: న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అందరూ కరోనా ( Coronavirus ) బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌లో మరో కోవిడ్ పాజిటివ్‌ కేసు వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్‌ కృతి సనన్‌ ( Kriti Sanon ) కు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. 
ప్రస్తుతం రాజ్‌కుమార్‌రావ్‌తో కలిసి ఓ సినిమా చేస్తోంది కృతి సనన్. ఇటీవలనే ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకొని చండీగఢ్‌ నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతూ విమానంలో అభిమానులతో కలిసి ఒక ఫొటోను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆ పోస్టు తర్వాత నుంచి కృతి సనన్ మళ్లీ సోషల్‌ మీడియాలో కనిపించలేదు. తాజాగా ఆమె కరోనా బారిన పడినట్లు బాలీవుడ్ ( Bollywood )వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై కూడా ఆమె క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇదిలావుంటే అంతకుముందు ‘జగ్ జగ్ జీయో’ (Jug Jugg Jeeyo) సినిమా షూటింగ్‌లో ఉండగానే నటులు వరుణ్‌ ధావన్‌తోపాటు నీతూ కపూర్‌, మనీశ్‌పాల్‌, దర్శకుడు రాజ్ మెహతా కూడా కరోనా బారినపడ్డారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అనిల్‌ కపూర్‌ కూడా నటిస్తున్నారు. వారికి కరోనా నెగెటివ్‌‌గా వచ్చింది. అనిల్ కపూర్‌కు కరోనా సోకినట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ తనకు మాత్రం కరోనా నెగిటివ్‌గా ఫలితం వచ్చిందని.. ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిల్ కపూర్ వెల్లడించారు. Also read: Bharat Bandh: నేడు భారత్ బంద్.. కేంద్రం నుంచి రాష్ట్రాలకు సూచనలు


అయితే.. కృతిసనన్‌ తెలుగులో మహేశ్ సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాలో, ఆ తర్వాత నాగచైతన్యతో కలిసి ‘దోచెయ్‌’ మూవీలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన ఈ భామ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆది పురుష్‌’లో సీతగా నటించనుందని కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. కానీ దీనిపై మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 


Also read: Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook