Kushboo Sundar : ఖుష్బూ సుందర్ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ అవుతూ పోస్ట్!
Kushboo Sundar Brother: నటి, రాజకీయ నేత ఖుష్బూ సుందర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది, ఆమె సోదరుడు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆ వివరాల్లోకి వెళితే
Actress Kushboo Sundar Brother Passes Away: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కేవలం తెలుగు మాత్రమే కాదు ఇతర భాషలకు చెందిన సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు చనిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు తమిళ స్టార్ హీరోయిన్, తెలుగులో కూడా అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం నటిగా అవకాశాలు తగ్గడంతో రాజకీయాల్లో చేస్తూ బీజేపీలో యాక్టివ్ గా ఉంటున్న ఖుష్బూ సోదరుడు అబ్దుల్లా ఖాన్ కన్నుమూశారు.
ఈ విషయాన్ని ఖుష్బూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అబ్దుల్లా ఖాన్ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన ఖుష్బూ మీతో కలకాలం ఉండాలని ఎంతో కోరుకున్నా కానీ వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది, మీ ప్రేమ ఎప్పుడూ మాతోనే ఉంటుంది అని ఆమె పేర్కొన్నారు.
అయితే తన సోదరుడు అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో హాస్పిటల్ లో ఉన్నాడని అతని గురించి అందరూ ప్రార్థించాలని ఖుష్బూ రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో తన సోదరుడు తిరిగి రావాలని ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ధన్యవాదాలు తెలిపారు ఖుష్బూ. ఖుష్బూ 1970లో సెప్టెంబర్ 29న ముంబైలోని అంధేరిలో జన్మించగా ఆమె అసలు పేరు నఖత్ ఖాన్. సినిమాల్లోకి వచ్చాక ఆమె ఖుష్బూ అని పేరు మార్చుకున్నారు.
ఇక ఆమెకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు వారు అబ్దుల్లా, అబూ బాకర్, అలీ. వారిలో అబ్దుల్లా ఇవాళ కాలం చెందారు. అబ్దుల్లా అంటే ఇప్పుడు చనిపోయిన ఆయన కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఇక ఖుష్బూ కుటుంబంలో గతంలో కూడా ఒక తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. 2020 వ సంవత్సరంలో జూన్ నెలలో ఖుష్బూ వదిన కూడా అనారోగ్య కారణాలతో బాధపడుతూ కరోనా నేపథ్యంలో కన్నుమూశారు. ఇప్పుడు ఆమె సోదరుడు కూడా కన్నుమూయడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Also Read: Nandamuri Balakrishna-Jr NTR : ఎన్టీఆర్ అంటే బాలయ్యకు నచ్చదు!.. మరోసారి రుజువైందిగా
Also Read: Avatar 2 Vs kgf chapter 2 : కేజీయఫ్‌ను దాటని అవతార్ 2.. కలెక్షన్లలో కనిపించిన మ్యాజిక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.