Avatar 2 Vs kgf chapter 2 : కేజీయఫ్‌ను దాటని అవతార్ 2.. కలెక్షన్లలో కనిపించిన మ్యాజిక్

Avatar 2 Day 1 Collections in Telugu States అవతార్ 2 సినిమా కలెక్షన్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినిమా మీద మిక్స్డ్ టాక్ రావడంతో కాస్త కలెక్షన్ల మీద ప్రభావం పడింది. అయితే ఆ విజువల్స్ చూడాలని, దాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలని థియేటర్లకు జనాలు వస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2022, 03:58 PM IST
  • ప్రపంచమంతా అవతార్ 2 సందడి
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్
  • కేజీయఫ్ చాప్టర్ 2ని దాటని అవతార్ 2
Avatar 2 Vs kgf chapter 2 : కేజీయఫ్‌ను దాటని అవతార్ 2.. కలెక్షన్లలో కనిపించిన మ్యాజిక్

Avatar 2 Vs kgf chapter 2 : అవతార్ 2 సినిమా కోసం ప్రపంచంలోని సినీ అభిమానులంతా కూడా వేయి కళ్లతో ఎదురుచూడసాగారు. టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అంచనాలు పెంచేశాయి. జేమ్స్ కామెరాన్ మళ్లీ అద్భుత సృష్టి చేశాడని, దాన్ని వీక్షించాల్సిందే అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే అవతార్ 2 కథ పరంగా కాస్త నిరాశపర్చింది. కథ, కథనాలు తెలుగు సినిమాల్లో చూసినట్టుగానే ఉన్నాయని, ఆ పాయింట్‌తో ఎన్నో చిత్రాలు వచ్చాయని జనాలు పెదవి విరుస్తున్నారు.

అయితే అవతార్ 2 సినిమా విజువల్స్ పరంగా టాప్ నాచ్ అని, ఇలా ఇంకెవ్వరూ కూడా ఊహించలేరని, తీయలేరని, అది కేవలం జేమ్స్ కామెరాన్ వల్లే సాధ్యం అవుతుందని జనాలు పొగిడేస్తున్నారు. అవతార్ 2 ఎన్ని అంచనాల నడుమ విడుదలైనప్పటికీ కలెక్షన్లలో మాత్రం ప్రభావం కనిపించడం లేదు. అవతార్ 2 కలెక్షన్లు అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని అంతా అనుకున్నారు.

కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డులను బద్దలు చేయలేకపోయింది. అవెంజర్ ఎండ్ గేమ్ ఓపెనింగ్ డే రికార్డులను కూడా అవతార్ 2 కొల్లగొట్టలేకపోయింది. ఇక రెండు తెలుగు రాష్రాల్లో అయితే డబ్బింగ్ సినిమాల కేటగిరీలో కేజీయఫ్ ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. కేజీయఫ్ చాప్టర్ 2 ఓపెనింగ్ డే రికార్డులను కూడా అవతార్ 2 బీట్ చేయలేకపోయింది. 

ఈ ఏడాదిలో రిలీజ్ అయిన కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ డే నాడు 31 కోట్లు కొల్లగొట్టేసింది. కానీ అవతార్ 2 మాత్రం కేవలం పద్నాలుగు కోట్లు మాత్రమే రాబట్టేసింది. ఇలా చివరకు కేజీయఫ్‌ని కూడా అవతార్ దాట లేకపోయింది. ఇండియా వైడ్‌గా చూసుకుంటే ఎండ్ గేమ్ రికార్డులను కూడా అవతార్ రెండో పార్ట్ బీట్ చేయలేకపోయింది.

Also Read : Pushpa The Rise Glimpse : వెనుకడుగు వేసిన పుష్ప టీం.. అవతార్‌ 2తో పాటు థియేటర్లో రాకపోవడానికి కారణం ఇదేనట

Also Read : chiranjeevi-Radhika : చిరు రాధిక కాంబోలో సినిమా.. నాడు ఇచ్చిన మాటకోసమేనా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News