Lavanya Tripathi: విశాఖ బీచ్‌లో చెత్తాచెదారం ఏరివేసిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి
Viza Beach: విశాఖపట్టణం సముద్ర తీరంలో సొట్ట బుగ్గల సుందరి.. సినీ నటి.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి చెత్తాచెదారం ఏరివేసింది. జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా వైజాగ్ బీచ్‌లో స్వచ్ఛత కార్యక్రమాలను చేపడుతూనే తన వెబ్ సిరీస్ `మిస్ పర్ఫెక్ట్`పై కూడా ప్రచారం చేసుకుంది.
Ms Perfect Web Series: మెగా నటుడు వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన ప్రాజెక్ట్ ఇదే. వివాహం తర్వాత సినిమాలు చేయని లావణ్య 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్ చేసింది. హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రసారం కానున్న వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగా లావణ్య విశాఖపట్టణానికి వచ్చింది. జాతీయ పరిశుభ్రత దినోత్సవం కూడా కావడంతో ఆదివారం విశాఖపట్టణంలో సముద్ర తీర ప్రాంతంలో శుభ్రతా కార్యక్రమాలు చేపట్టింది. వైజాగ్ వాలంటీర్స్‌తో కలిసి బీచ్‌లో లావణ్య చెత్తాచెదారం ఏరి వేసింది. బీచ్‌కు వచ్చిన వారికి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ బృందంతోపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
అందమైన విశాఖ సముద్ర తీరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని వైజాగ్‌వాసులకు లావణ్య త్రిపాఠి సూచించారు. తాను నటించిన వెబ్ సిరీస్‌లో తన పాత్ర కూడా పరిశుభ్రతపైనే ఉంటుందని లావణ్య తెలిపింది. పరిశుభ్రత పట్ల అంకితభావం కలిగిన మహిళగా తన పాత్ర ఉందని వివరించింది. స్వచ్ఛత కార్యక్రమం అనంతరం లావణ్య మాట్లాడుతూ.. 'విశాఖపట్టణం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ అనేక సూపర్ హిట్ సినిమాలు షూట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలతో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి' అని సూచించింది.
బిగ్‌బాస్ విజేత అభిజిత్‌తో లావణ్య త్రిపాఠి నటించిన 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్‌ను విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించాడు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న ఈ వెబ్ సిరీస్‌లో లావణ్య చుట్టూ సిరీస్ కొనసాగుతుందని ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌తో తెలుస్తోంది. పని మనిషి పాత్రలో లావణ్య సరికొత్తగా కనిపిస్తున్నారు. పెళ్లి తర్వాత నటించిన తొలి ప్రాజెక్ట్ కావడంతో లావణ్యతో పాటు మెగా కుటుంబం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సిరీస్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది.
Also Read: Niharika Vs Chaitanya: నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందన.. తనను నిందించొద్దని హితవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook