Nivetha Thomas: వకీల్ సాబ్ భామ సాహసం.. కిలిమంజారోను అధిరోహించిన నివేదా థామస్..
Nivetha Thomas: తన సహజమైన నటనతో మెప్పించే నివేదా థామస్... నిజ జీవితంలో సాహసాలు చేస్తూ ఉంటుంది. అలా ఇటీవలే ఆమె ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
Nivetha Thomas: తన యాక్టింగ్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న నటి నివేదా థామస్. తాజాగా ఆమె చేసిన సాహసం పలువురు ప్రశంసలు పొందుతుంది.
ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన శిఖరం కిలిమంజారో(Mount Kilimanjaro) ఎక్కాలంటే చాలా ధైర్యం కావాలి. అలాంటి శిఖరాన్ని అధిరోహించి..ఔరా అనిపించింది వకీల్ సాబ్ బ్యూటీ నివేదా థామస్(Nivetha Thomas). సూపర్ ఉమెన్ కిలిమంజారో పర్వత శిఖరానికి చేరుకున్న తర్వాత దిగిన ఫోటోను షేర్ చేస్తూ తాను సాధించానని సంతోషం వ్యక్తం చేసింది. ఆ ఫోటో, ఆమె పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు సైతం సోషల్ మీడియా(Social Media) ద్వారా నివేదాను అభినందిస్తున్నారు.
Also read: chiranjeevi: మెగాస్టార్ పెద్ద మనసు..అభిమాని కోసం ఫ్లైట్ టికెట్స్ పంపి మరీ....
విబిన్న పాత్రలతో మెప్పించిన నివేదా..
జెంటిల్ మెన్, నిన్ను కోరి, జై లవ కుశ, బ్రోచేవారెవరురా, దర్బార్, 118, వి, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో టాలీవుడ్(Tollywood) ప్రేక్షకులను అలరించిన నివేదా థామస్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా కసాండ్రాతో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. ఈ చిత్రం కొరియన్ మూవీ ‘మిడ్ నైట్ రన్నర్స్’ అధికారిక రీమేక్. ఈ సినిమాలో స్టంట్స్ చేయడం కోసం ఆమె కఠిన శిక్షణ తీసుకుంటోంది.
ట్రెక్కింగ్ పై మక్కువ
చిన్నప్పటి నుంచి నివేదాకు ట్రెక్కింగ్(Trekking) అంటే ఆసక్తి ఎక్కువ. కిలిమంజారో అధిరోహించాలనే లక్ష్యంతో ఆరు నెలలపాటు ట్రెక్కింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. 19,340 అడుగుల ఎత్తు ఉన్న కిలిమంజారో పర్వతంపై ట్రెక్కింగ్ ఎంతో సాహసోపేతంతో కూడుకున్నది. కాని దానిని విజయవంతంగా పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచింది నివేదా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook