Actress payal ghosh: ద‌ర్శ‌కుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్‌(anurag kashyap)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన నటి పాయల్ ఘోష్‌పై యాసిడ్‌ దాడి జరిగింది. ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చిన కొంద‌రు త‌న‌పై దాడి చేసిన‌ట్లు పాయల్‌ తెలిపింది. ముంబైలో ఓ షాపులో మందులు కొనుక్కొని తిరిగి వచ్చి కారులో కూర్చుంటున్న స‌మ‌యంలో ఈ దాడి జ‌రిగినట్లు పేర్కొంది. పాయల్‌(payal ghosh) త‌న‌పై జ‌రిగిన దాడికి సంబంధించిన అంశాల‌ను వెల్ల‌డిస్తూ ఇన్‌స్టా(Instagram)లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులో.. ఆమె తన కారులోకి వెళ్తుండగా కొంతమంది మాస్క్‌ ధరించిన వ్యక్తులు రాడ్‌తో దాడి చేశారని, వారి చేతిలో బాటిల్ కూడా ఉందని, అది యాసిడ్ అని తాను భావించినట్లు పాయల్(payal ghosh) చెప్పింది. అయితే ఈ దాడి(Attack) నుంచి తను తప్పించుకున్నట్లు, కానీ ఎడమ చేతికి స్వల్పంగా గాయం అయ్యినట్లు పేర్కొంది. దాడి జరుగుతున్న సమయంలో తాను గట్టిగా అరవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారని తెలిపింది.


Also Read: Taapsee pannu: హీరోయిన్ తాప్సీ శరీరంపై నెటిజన్ కామెంట్..నటి ఘాటు రిప్లై


ఇలాంటి సంఘటన తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని ఇదే మొదటిసారని పాయల్‌ చెప్పుకొచ్చింది. ఈ అంశంపై పోలీసు కేసు న‌మోదు చేయ‌నున్న‌ట్లు న‌టి వెల్ల‌డించింది. కాగా ఈ దాడికి సంబంధించి ఎవరినైనా అనుమానిస్తున్నారా అనే దానిపై మాట్లాడుతూ పాయల్ ఇలా చెప్పింది.. స్పష్టంగా, అతను తెలిసిన వాళ్లు కాదు, కానీ ఇదంతా ఓ ప్లాన్‌ ప్రకారం చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook