Taapsee: తాప్సీ శరీరంపై నెటిజన్ సెటైరిక‌ల్ కామెంట్...అదిరిపోయే రిప్లై ఇచ్చిన సొట్ట‌బుగ్గల సుంద‌రి

Taapsee pannu: తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ‘రష్మీ రాకెట్‌’. ఈ సినిమాలో గుజరాతీ స్పింటర్‌ రష్మీ పాత్రలో నటిస్తోంది. అథ్లెట్‌ బాడీ కోసం ఈ నటి పడిన కష్టానికి ఎంతోమంది ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2021, 04:32 PM IST
Taapsee: తాప్సీ శరీరంపై నెటిజన్ సెటైరిక‌ల్ కామెంట్...అదిరిపోయే రిప్లై ఇచ్చిన సొట్ట‌బుగ్గల సుంద‌రి

Taapsee pannu 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నటి తాప్సీ. మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి..తన కంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత బాలీవుడ్ తలుపు తట్టింది. అక్కడ సూపర్ హిట్ సినిమాల్లో నటించి...బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు. ఈ అమ్మ‌డు కెరీర్‌లో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చూసింది. ఎంతో క‌ష్ట‌ప‌డి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చారు. ప్ర‌స్తుతం తాప్సీ... 'ర‌ష్మీ రాకెట్'(Rashmi Rocket)అనే సినిమాలో న‌టిస్తుంది. ఇందులో గుజరాతీ స్పింటర్‌ రష్మీ పాత్రలో నటిస్తోంది.

ఈ పాత్ర కోసం తాప్సీ (Taapsee pannu)చాలా క‌ష్ట‌ప‌డింది. ఆమె ఎన్నో నిద్ర‌లేని రాత్రులు గడిపింది. అయితే ఇటీవ‌ల సినిమా ప్రమోషన్ లో భాగంగా తానూ వెనక్కి తిరిగి ఉన్న ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ ‘ఎవరో చెప్పుకోండి?’ అని క్యాప్ష‌న్ ఇచ్చింది. దీనికి ఓ నెటిజ‌న్..ఆ శ‌రీరం తాప్సీకి మాత్ర‌మే ఉంటుంది అని సెటైరిక‌ల్‌గా మెసేజ్ పెట్టాడు.

Also Read: Pelli SandaD: రేపే ‘పెళ్లి సందD’ ట్రైలర్...రిలీజ్ చేయనున్న సూపర్ స్టార్

ఆ కామెంట్‌కి ​స్పందించిన తాప్పీ..‘సెప్టెంబర్ 23 వరకు ఈ లైన్ గుర్తుపెట్టుకో, నేను ఈ ప్రశంస కోసం చాలా కష్టపడ్డాను. నీకు ధన్యవాదాలు’ అంటూ రిప్లై ఇచ్చింది. అథ్లెట్(Athlet) పాత్ర కోసం తాప్సీ చాలా క‌ష్ట‌ప‌డ‌గా,ఆమెపై ఎంతోమంది ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సినిమాని అక్టోబర్‌ 15న జీ5 యాప్‌(Zee5 APP)లో విడుదల చేయనున్నారు. మ‌రోవైపు తాప్సీ మిథాలీ రాజ్ బ‌యోపిక్‌లోను న‌టిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News