Akira Nandan's Boxing Video: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ నేడు 18వ వడిలోకి అడుగుపెట్టాడు. అకిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా అతని తల్లి, నటి రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అతని బాక్సింగ్ వీడియో షేర్ చేశారు. వైట్ షర్ట్, బాక్సింగ్ ట్రౌజర్స్‌ ధరించిన అకీరా నందన్... పిడి గుద్దులు కురిపిస్తూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అకీరా బర్త్ డే రోజు రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ వీడియో చూసి పవన్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రేణు దేశాయ్ తన తనయుడి గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'అకీరా నాకు మంచి కొడుకు మాత్రమే కాదు. ఆద్యకి మంచి అన్నయ్య. అతని మిత్రులకు గొప్ప స్నేహితుడు. వ్యక్తిగతంగా నిజాయితీ గల మంచి మనసున్న జెంటిల్‌మ్యాన్. ఇవాళ 18వ వడిలోకి అడుగుపెడుతున్న అకీరాకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. అకీరాకు విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు...' అని రేణు దేశాయ్ పేర్కొన్నారు.


పవన్ కల్యాణ్ వారసుడు  కావడంతో సహజంగానే అకీరా నందన్ సినీ ఎంట్రీపై ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అకీరా త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ అడపాదడపా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇవాళ అకీరా బర్త్ డే సందర్భంగా రేణు దేశాయ్ అకీరా సినీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. నటుడు అవాలనే కోరిక అకీరాకు లేదని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. అకీరా ఇంతవరకూ ఏ సినిమాకు కమిట్ అవలేదని... అతని సినీ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.



Also Read: Moto G22: మోటో నుంచి మరో బడ్జెట్ ఫోన్​.. ప్రీమియం ఫీచర్లతో


Yami Gautam: ఇప్పటివరకూ మీ పోర్టల్‌ని ఫాలో అయ్యేదాన్ని.. ఇకపై కాను! రివ్యూపై యామీ గౌతమ్ ఆగ్రహం


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook