Samantha: సమంతా ఇంట్లో పెను విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి..
Samantha Ruth Prabhu father: సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూసినట్లు తెలుస్తొంది.
Samantha father passedaway: సమంతా రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు చనిపోయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో సామ్ తన ఇన్ స్టాలో ఎమోషనల్ స్టోరీని పోస్ట్ చేశారు. సమంత ఇటీవల సిటాడెల్ బన్నీ వెబ్ సిరిస్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ ఘటనతో సమంతా అభిమానులు సైతం షాక్ ను గురిచేస్తుందంట. అసలు.. ఆయన చనిపోవడానికి కారణమేంటని చాలా మంది ఎక్స్ వేదికగా కామెంట్లు చేస్తున్నారంట. మరోవైపు ఈ విషాదకర సమయంలో సమంతకు ఆ దేవుడు ధైర్యంను ఇవ్వాలని కూడా ప్రార్థిస్తున్నారంట. సమంతా చెన్నైలో జోసెఫ్ ప్రభు , నినెట్ ప్రభు దంపతులకు జన్మించినట్లు తెలుస్తుంది.
జోసెఫ్ ప్రభు ఒక ఆంగ్లో ఇండియన్. చిన్నతనం నుంచి సామ్ కు తన తండ్రితో ఒక గొప్ప అటాచ్ మెంట్ ఉందంట. ఈ క్రమంలో సినిమాల్లో రావడానికి ఆమె తండ్రి ఎంతో సపోర్ట్ ఇచ్చారంట. ఈ క్రమంలో సామ్ ఇన్ స్టాలో హర్ట్ బ్రేకింగ్ ఎమోజీని పోస్ట్ చేసి.. తన తండ్రి చనిపోయారనే వార్తను షేర్ చేసినట్లు తెలుస్తొంది. దీంతో సామ్ అభిమానులు, ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.