Samyuktha Hegde Injured: వివాదాస్పద హీరోయిన్ కు తీవ్ర గాయాలు.. ఏమైందంటే?
Samyuktha Hegde injured: సంయుక్త హెగ్డే తెలుగులో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె షూటింగ్ లో గాయపడినట్లు తెలుస్తోంది.
Samyuktha Hegde injured: కన్నడ నాట వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త హెగ్డే తెలుగులో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సత్య అనే పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు మరో తెలుగు సినిమా అవకాశం దక్కలేదు. కానీ వరుసగా తమిళ, కన్నడ సినీ అవకాశాలు దక్కించుకుని వరుస సినిమా షూటింగ్స్ తో ముందుకు వెళుతోంది.
అయితే తాజాగా ఆమె షూటింగ్ లో గాయపడినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాను ఫైట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో కాలు సరిగ్గా ల్యాండ్ అవక పోవడం వల్ల మోకాలి దగ్గరలో బలమైన గాయమైందని ఆమె వెల్లడించారు. డాక్టర్ కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. అయితే తనకు ఎలా యాక్సిడెంట్ అయింది అనే విషయాన్ని చూపించడానికి ఆమె మేకింగ్ వీడియోని కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు.
అయితే గాయం వల్ల తాను బాధపడుతూ ఇంటికే పరిమితమైనా సరే సినిమా విడుదలైన తర్వాత ఆ ఫైట్ సీన్ చూసి కచ్చితంగా ప్రేక్షకులు తనను మెచ్చుకుంటారని తనకు నమ్మకం ఉందంటూ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఇక ఆమె నటించిన మన్మధ లీలై అనే సినిమా ఆహాలో విడుదలైన సంగతి తెలిసిందే. గతంలో ఒక పార్కులో పబ్లిక్ గా స్పోర్ట్స్ బ్రోతో వ్యాయామం చేస్తున్న సంయుక్త ఆమె స్నేహితురాళ్లపై కవితా రెడ్డి అని ఒక మహిళ దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. అప్పట్లో సంయుక్త చాన్నాళ్ల పాటు వార్తల్లో నిలిచారు.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ దూకుడు.. రోజుల వ్యవధిలో మూడో యాడ్… క్రేజ్ వాడకం మామూలుగా లేదుగా!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook