Allu Arjun & Harish Shankar: అల్లు అర్జున్ దూకుడు.. రోజుల వ్యవధిలో మూడో యాడ్.. క్రేజ్ వాడకం మామూలుగా లేదుగా!

Allu Arjun Astral Pipes Ad Shoot With Harish Shankar: ఆస్ట్రల్ పైప్స్ సంస్థకు సంబంధించిన యాడ్ ఫిలిం షూటింగ్ హైదరాబాద్లో జరిగింది. ఈ యాడ్ ఫిలింకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2022, 08:19 PM IST
Allu Arjun & Harish Shankar: అల్లు అర్జున్ దూకుడు.. రోజుల వ్యవధిలో మూడో యాడ్.. క్రేజ్ వాడకం మామూలుగా లేదుగా!

Allu Arjun Astral Pipes Ad Shoot With Harish Shankar: అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప తర్వాత ఒక్కసారిగా పెరిగిపోయింది. నిజానికి అప్పటికే అల్లు అర్జున్ కి సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ పుష్ప తర్వాత ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ నార్త్ లో కూడా బీభత్సంగా పెరిగిపోయింది. ఇక ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతున్న దృష్ట్యా ఆయనతో పలు బ్రాండ్స్ కూడా కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నాయి.

అల్లు అర్జున్ తమ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తే తమ బ్రాండ్ వ్యాల్యూ కూడా పెరుగుతుందని కొన్ని బ్రాండ్స్ నమ్ముతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయనతో పనిచేయడానికి అనేక బ్రాండ్స్ క్యూ కట్టాయి. అయితే అల్లు అర్జున్ మాత్రం అన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించకుండా తనకు నచ్చిన బ్రాండ్స్ తో మాత్రమే కలిసి పని చేస్తూ వెళ్తున్నారు. ఇప్పటికే ఆయన జొమాటో, రాపిడో, రెడ్ బస్ వంటి సంస్థలకు పని చేస్తుండగా తాజాగా మరో సంస్థకి కూడా అంబాసిడర్ గా వ్యవహరిన్నారు. ఆస్ట్రల్ పైప్స్ సంస్థకు సంబంధించిన యాడ్ ఫిలిం షూటింగ్ హైదరాబాద్లో జరిగింది.

ఈ యాడ్ ఫిలింకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ యాడ్ ఫిలిం షూటింగ్ సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితమే హరీష్ శంకర్ తో కలిసి మరో యాడ్ ఫిలిం షూటింగ్లో కూడా పాల్గొన్నారు. బ్యాంకాక్ లో కోక్ కి సంబంధించిన ఒక యాడ్ ఫిలిం కూడా వీరిద్దరూ కలిసి షూట్ చేశారు.

ఆ తరువాత త్రివిక్రమ్ తో కలిసి మరో యాడ్ షూట్ చేశారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆస్ట్రల్ పైప్స్ సౌత్ విభాగానికి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. నిజానికి నార్త్ లో ఈ బాధ్యతలను రణవీర్ సింగ్ చూసుకుంటున్నారు.  ఆయన ఆస్ట్రల్ పైప్స్ నార్త్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా సౌత్ లో ఇక మీదట అల్లు అర్జున్ ప్రమోట్ చేయనున్నారు. 

Read Also: Vikranth Rona Movie Review: విక్రాంత్ రోణ సినిమా రివ్యూ.. ప్రేక్షకులను ఆకట్టుకుందా..?

Read Also: Ramarao on Duty: రామారావు ఆన్ డ్యూటీ లీక్డ్ వీడియో.. అధికార పార్టీకి మాస్ వార్నింగ్.. థియేటర్లు బద్దలే!

నిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News