Ramarao on Duty: రామారావు ఆన్ డ్యూటీ లీక్డ్ వీడియో.. అధికార పార్టీకి మాస్ వార్నింగ్.. థియేటర్లు బద్దలే!

Ramarao on Duty movie video leaked:  టాలీవుడ్ ను లీకుల బెడద వదిలేలా కనిపించడం లేదు. రవితేజ సినిమాకు కూడా  అదే పరిస్థితి ఏర్పడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2022, 05:00 PM IST
Ramarao on Duty: రామారావు ఆన్ డ్యూటీ లీక్డ్ వీడియో.. అధికార పార్టీకి మాస్ వార్నింగ్.. థియేటర్లు బద్దలే!

Ramarao on Duty movie video leaked: రవితేజ ఖిలాడీ సినిమా తర్వాత ఎలా అయినా సరే హిట్టు కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు..ఇప్పటికే ఆయన వరుస సినిమాలు ప్రకటించారు. తాజాగా ఆయన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూలై 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఒక 20 సెకండ్ల వీడియో లీక్ కావడం కలకలం సృష్టించింది. నిజానికి టాలీవుడ్ ను ఈ లీకుల బెడద వదిలేలా కనిపించడం లేదు.

ఇప్పటికే అనేక సినిమాలకు సంబంధించి ఇలానే పాటలు,  చిన్న చిన్న బిట్లు బయటికి వచ్చి కలకలం రేపగా ఇప్పుడు రవితేజ సినిమాకు కూడా దాదాపు అదే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ లీకైన చిన్న బిట్లో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా ఉండడం మరింత ఆసక్తికరంగా మారింది. రేయ్ మీరు ఎవరో ఏ పార్టీ నో నాకు అనవసరం,  ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని,  కొండలు తవ్వేస్తాం,  చెరువులు పూడ్చేస్తాం,  అడ్డంగా భూములు కొట్టేద్దాం అని దౌర్జన్యం చేయాలని చూస్తే,  తాత తీస్తా అన్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి అలాగే రవితేజ టీం వర్క్స్ బ్యానర్ మీద రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దివ్యాంశా కౌశిక్,  రజీషా విజయన్ హీరోయిన్ గా నటించగా అన్వేషీ జైన్ ఒక ఐటెం సాంగ్ లో నర్తించారు. ఇక ఈ లీకైన వీడియో ఎడిటింగ్ రూమ్ నుంచే బయటకు వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వీడియో చివరిలో ఎడిటింగ్ సిస్టం కూడా కనిపిస్తూ ఉండడంతో ఎడిటింగ్ రూమ్ నుంచి లేదా సినిమాకి సంబంధించి పనిచేస్తున్న వారి దగ్గర నుంచే బయటకు లీకై ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. 
Also Read: Avika Gor: బికినీలో దర్శనం ఇచ్చిన అవికా గొర్.. నెవర్ బిఫోర్ అనిపించేంతలా అందాల విందు

Also Read: Vikranth Rona Movie Review: విక్రాంత్ రోణ సినిమా రివ్యూ.. ప్రేక్షకులను ఆకట్టుకుందా..?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News