Prabhas and Kriti Sanon at Adipurush Pre Release Event in Tirupati: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ మూవీ 'ఆది పురుష్'. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించగా.. రావణాసురుడి పాత్రను సైఫ్‌ అలీ ఖాన్‌ పోషించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆది పురుష్ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇందులో భాగంగా తిరుపతిలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) స్టేడియంలో ఈ వేడుక అంగరంగ వైభాగంగా జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఆది పురుష్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సందర్భంగా హీరో ప్రభాస్ తన పెళ్లిపై (Prabhas Marriage) స్పందించాడు. స్టేజ్ మీద ప్రభాస్ మాట్లాడుతుండగా..  పెళ్లెప్పుడు చేసుకుంటారు అని అభిమానులు అడగ్గా చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాననే విషయం చెప్పకుండా.. తప్పకుండా తిరుపతిలోనే చేసుకుంటా అని సమాధానం ఇచ్చారు. దాంతో పెళ్లి కూతురు, డేట్ తెలియకపోయినా.. వేదిక మాత్రం తిరుపతి అని స్పష్టం అయింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రభాస్ ఫాన్స్ త్వరలోనే తీపి కబురు చెబుతాడని సంబరపడిపోతున్నారు. 


ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (Adipurush Pre Release Event) సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ... '7 నెలల క్రితం 3డీలో ట్రైలర్‌ విడుదల అయింది. అప్పుడు మీరిచ్చిన ధైర్యంతోనే ఆది పురుష్ టీమ్‌ మరింత కష్టపడి పని చేసింది. మీ ప్రోత్సాహంతోనే చిత్ర బృందం ఎంతో కష్టపడింది. షూటింగ్ కారణంగా రోజుకు 2-3 గంటలు నిద్రపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఆది పురుష్‌ లాంటి సినిమా చేయడం నా అదృష్టం. సినిమా మొదలయ్యాక మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశా. ‘ఏంటి.. ప్రభాస్ రామాయణం చేస్తున్నావా? అని అన్నారు. అవునండీ అని చెప్పా. అందరికీ ఇలాంటి అదృష్టం దొరకదు. నీకు దక్కింది' అని అన్నారు. అప్పుడు చాలా సంతోషించా' అని చెప్పారు. 


'రామాయణం చేయాలంటే కష్టపడాల్సి ఉంటుందని అంటారు. అలాంటి కష్టాలు ఎదురయ్యాయి. నా 20 ఏళ్ల కెరీర్‌లో ఓం రౌత్‌ లాంటి వ్యక్తిని చూడలేదు. ఒక యుద్ధంలా సినిమాను పూర్తి చేశారు. నిర్మాత భూషణ్‌ కుమార్‌ ఈ సినిమాను ఒక ఎమోషనల్‌గా తీసుకున్నారు. సినిమాలో సన్నీ సింగ్‌, దేవదత్త నాగే చాలా బాగా నటించారు. కృతి సనన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీత పాత్రకు సంబంధించిన పోస్టర్‌లో ఎక్స్‌ప్రెషన్‌ చూసి ఆశ్చర్యపోయా. ప్రేక్షకులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే సినిమా పూర్తి చేశాం. వేదికలపై నేను మాట్లాడే దానికంటే ఈసారి ఎక్కువ మాట్లాడా. ఇక నుంచి అభిమానుల కోసం ఏడాదికి 2 సినిమాలు చేస్తా. కుదిరితే 3 కూడా చేస్తా. తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేయాలన్నది నా సిద్ధాంతం' అని ప్రభాస్ పేర్కొన్నారు. 


Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023.. విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న రికార్డ్స్ ఇవే!   


Also Read: King Cobra Viral Video: కింగ్ కోబ్రా చర్మాన్ని పీకేసిన వ్యక్తి.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.