Aditi Rao Hydari Plastic Surgery: తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయిన అదితి రావు హైదరి బాలీవుడ్ లో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పుడో 2006లో ప్రజాపతి అనే మలయాళం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదితి రావు హిందీలో పలు హిట్ సినిమాలలో కూడా చిన్న పాత్రలలో కనిపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఒకలా ఉన్న అదితి ఇప్పుడు మాత్రం చాలా మారిపోయింది. దానికి కారణం ఆమె చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ. హీరోయిన్ గా ఎదగడం కోసం అదితి రావు హైదరి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందంగా మారింది అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. దానికి ఆధారంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో అదితి రావు హైదరి ఫోటోలతో ఇప్పటి ఫోటోలు పోలుస్తూ కచ్చితంగా ప్లాస్టిక్ సర్జరీ వల్లే ఆమె ఇలా మారింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


"ఆమె ముక్కు చూస్తేనే సర్జరీ చేయించుకున్నట్టు క్లియర్ గా తెలిసిపోతుంది. ఎంత తినడం మానేసినా కూడా ఇంత అందంగా మారడం కుదరదు" అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. డబ్బుతో అందాన్ని కూడా కొనచ్చు అనడానికి అదితి రావు ఉదాహరణ అని మరొకరు చెబుతున్నారు. 


మరోవైపు తాను కూడా ఒక ప్లాస్టిక్ సర్జన్ నే అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. "నేను ఒక ప్లాస్టిక్ సర్జన్ ని. నాకు ఇప్పటికీ సెలబ్రిటీలు ఎందుకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నారు అనే విషయాన్ని దాచిపెడతారో అర్థమే కాదు. మామూలు ప్రజలు దానిని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్లు వాళ్ళ ఫ్రెండ్స్ తో నేను రైనోప్లాస్టీ చేయించుకున్నాను. ఇంత ఖర్చయింది. నా ముక్కు ఎలా ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు" అని కామెంట్ చేశారు. 


ఇక మరొక నెటిజన్ అయితే అదితి రావు హైదరి ముఖంలోని ప్రతి ఫీచర్ ని మార్చుకుంది అని, సర్జరీ తర్వాత ఆమె పూర్తిగా వేరే అమ్మాయిలాగా కనిపిస్తుంది అంటూ కామెంట్ పెట్టారు. 


మరోవైపు ఈ మధ్యనే హిరామండి వెబ్ సిరీస్ తో ఫిట్ అందుకున్న అదితీ రావు హైదరి ఒక ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది. 2021 నుంచి హీరో సిద్ధార్థ్ తో డేటింగ్ చేస్తున్న అదితి రావు ఈ మధ్యనే మార్చ్ లో నిశ్చితార్థం కూడా చేసుకుంది.


Also read: Income tax Alert: ఈ 5 లావాదేవీలతో జాగ్రత్త, ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు రావచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook