Income tax Alert: ఈ 5 లావాదేవీలతో జాగ్రత్త, ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు రావచ్చు

Income tax Alert: బ్యాంకు లావాదేవీలపై ఎప్పటికప్పుుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీ లావాదేవీలపై ఇన్‌కంటాక్స్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంటుంది. ఏడాదిలో ఎన్ని లావాదేవీలు, ఎంతమొత్తంలో జరుగుతున్నాయనేది పరిశీలిస్తుంటుంది. ఎక్కడైనా తేడా అన్పిస్తే వెంటనే నోటీసులు పంపిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2024, 08:38 AM IST
Income tax Alert: ఈ 5 లావాదేవీలతో జాగ్రత్త, ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు రావచ్చు

Income tax Alert: ప్రస్తుతం అంతా డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి. ఆన్‌లైన్ లావాదేవీలు ఎంతగా పెరిగినా ఇంకా నగదు లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్‌కంటాక్స్ నుంచి తప్పించుకునేందుకు ఇదో మార్గం కావచ్చు. అయితే మీరు చేసే నగదగు లావాదేవీలపై కూడా ఇన్‌కంటాక్స్ దృష్టి పెడుతుంటుంది. ముఖ్యంగా 5 రకాల అధిక మొత్తం లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అవేంటో తెలుసుకుందాం.

ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు ఖాతాలో ఒక ఏడాదిలో 10 లక్షల కంటే ఎక్కువ జమ చేస్తే వివరణ ఇచ్చుకోవల్సి ఉంమటుంది. అదే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ విషయంలో కూడా అంతే. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్‌డీల్లో ఒకే ఏడాది కాల వ్యవధిలో 10 లక్షలు దాటి జమ చేస్తే ఇన్‌కంటాక్స్ శాఖకు ఆ ఆదాయం ఎక్కడ్నించి వచ్చిందనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 

బ్యాంకు ఎక్కౌంట్‌లో నగదు జమ చేయడంపై పరిమితి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ నిబంధనల ప్రకారం ఒకే ఏడాదిలో 10 లక్షలు దాటి నగగదు జమ చేస్తే ఆ సమాచారం ఇన్‌కంటాక్స్ శాఖకు చేరుతుంది. నిర్ణీత పరిమితి దాటి నగదు జమ చేస్తే  ఆదాయం వివరాలు ఇవ్వాలి. 

షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్స్, డిబెంచర్ లేదా బాండ్ల కొనుగోలు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటికి సంబంధించిన సమాచారం ఇన్‌కంటాక్స్ శాఖకు చేరుతుంది. ఎవరైనా సరే 10 లక్షలు దాటి లావాదేవీలు ఈ రూపంలో చేస్తే ఆ సమాచారం బ్యాంకు నుంచి ఇన్ కంటాక్స్ శాఖకు చేరుతుంది. దాంతో మీ నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ అవుతాయి.

ఏదైనా ఆస్థి కొనుగోలు చేసే క్రమంలో 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీ జరిగితే రిజిస్ట్రార్ నుంచి ఇన్‌కంటాక్స్ శాఖకు సమాచారం అందుతుంది. ఆ డబ్బు ఎక్కడ్నించి వచ్చిందనే వివరాలు సమర్పించాలి. 

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు విషయంలో కూడా ఇన్‌కంటాక్స్ దృష్టి ఉంటుంది. మీ క్రెడిట్ కార్డు బిల్లు 1 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ చెల్లింపు నగదు రూపంలో చేస్తే మాత్రం ఆదాయం వివరాలు ఇవ్వాలి. ఒకే ఆర్ధిక సంవత్సరంలో 10 లక్షలసు దాటి బిల్లు ఏ రూపంలో చెల్లించినా అదే పరిస్థితి. 

Also read: AP EAPCET 2024 Results: ఏపీ ఈఏపీసెట్ 2024 ఫలితాలు ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News