Naga Babu And K Raghavendra Rao Wishes to Samantha : సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆమెకు ఆరోగ్యం బాగా లేదని తెలుసుకున్న తోటి నటీనటులు, ఇండస్ట్రీ సీనియర్ హీరోలు, దర్శకులంతా కూడా సమంతకు మానసికంగా ధైర్యాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. డియర్ సామ్.. నువ్ చాలా స్ట్రాంగ్, త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించాడు. మనకు నిత్యం కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతుంటాయ్.. అప్పుడే మనలోని మన శక్తిని మనం తెలుసుకోగలం.. నువ్వెంతో శక్తిగల దానివి.. అద్భుతమైన వ్యక్తివి.. ఈ బాధ నుంచి కూడా నువ్ త్వరగా బయటకు వచ్చేస్తావ్ అంటూ ఇలా సమంత గురించి ట్వీట్ వేశాడు చిరంజీవి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక మెగా బ్రదర్ నాగబాబు సైతం సమంత కోసం స్పెషల్ పోస్ట్ వేశాడు. నేను ఎప్పుడూ సమంతను నేరుగా కలిసింది లేదు.. మాట్లాడింది లేదు.. కానీ ఆమె ఇలాంటి వ్యాధితో బాధపడుతోందని తెలిసినప్పటి నుంచి నాకు ఎంతో బాధగా ఉంది.. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. ఆమె ఎప్పుడూ స్వతంత్రగానే ఎదిగింది.. ఎంతో ధృడమైంది కూడా.. ఎంతో మంచి వ్యక్తి. ఆమె ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని మరోసారి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తరం నటీనటుల్లో ఆమె ఒక గొప్ప నటి.. ఆమెను ఇంకా ఎన్నో గొప్ప పాత్రల్లో చూడాలని ఆడియెన్స్ అనుకుంటున్నారు.. అభిమానుల ప్రేమే ఆమెకు శ్రీరామరక్షలా నిలుస్తుందని నాగబాబు చెప్పుకొచ్చాడు.


ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ట్వీట్ వేస్తూ.. సమంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. మళ్లీ సమంత మునుపటి కంటే ఎంతో వేగంగా, ఆరోగ్యకరంగా వెనుదిరిగి రావాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. మొత్తానికి సమంత కోసం దాదాపు స్టార్ హీరోలంతా కూడా ట్వీట్లు వేశారు. దుల్కర్ సల్మాన్, ఎన్టీఆర్, రామ్, హన్సిక, కాజల్ అగర్వాల్, జాన్వీ కపూర్ ఇలా అందరూ కూడా సమంత త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.


సమంత ప్రస్తుతం తన షూటింగ్‌లన్నీ క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే విజయ్ కూడా ఖుషి సినిమాను పక్కన పెట్టేసి కొత్త సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నాడు. సమంత నటించిన యశోద సినిమా నవంబర్ 4న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ట్రైలర్‌తో యశోద సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటేశాయి. సరోగసి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్టుగా ట్రైలర్ చెప్పేస్తోంది.


Also Read : Jordar Sujatha - Rocking Rakesh : జబర్దస్త్ జోడి బాగుందే.. రాకేష్‌ ఇంట్లోనే సుజాత ఉంటోందా?.. పిక్ వైరల్


Also Read : Unstoppable season 2 episode 3 : కుర్ర హీరోలతో బాలయ్య సందడి.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లతో కబుర్లు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook