Unstoppable season 2 episode 3 : కుర్ర హీరోలతో బాలయ్య సందడి.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లతో కబుర్లు

NBK Unstoppable season 2 episode 3 Update నందమూరి బాలకృష్ణ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. మూడో ఎపిసోడ్ గెస్టులు ఎవరో తెలిసిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 06:43 PM IST
  • బాలయ్య అన్‌స్టాపబుల్ అప్డేట్
  • రెండో సీజన్‌లోని రెండు ఎపిసోడ్‌లు హిట్టే
  • మూడో ఎపిసోడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్లు
Unstoppable season 2 episode 3 : కుర్ర హీరోలతో బాలయ్య సందడి.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లతో కబుర్లు

Adivi Sesh And Sharwanand In Unstoppable : నందమూరి బాలకృష్ణ ఆహా కోసం చేస్తోన్న అన్ స్టాపబుల్ షో ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాలయ్యలోని ఇంకో కోణాన్ని ప్రపంచానికి చూపించినట్టు అయింది. అయ్యారు. బాలయ్య తన షోకు వచ్చిన గెస్టులతో ఎంత ఈజీగా, ఎంత ప్రేమగా కలిసిపోయాడో అందరికీ తెలిసిందే. ఇక ఈ షో మొదటి సీజన్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ మీద అంచనాలు పెరిగాయి. మొదటి సీజన్ ఎండింగ్ ఎపిసోడ్‌లో మహేష్‌ బాబు రావడం, అందులో హ్యూమన్ యాంగిల్ టచ్ చేయడంతో ఆ ఎపిసోడ్ మరింతగా క్లిక్ అయింది.

ఇక రెండో సీజన్‌లోని మొదటి ఎపిసోడ్‌లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను తీసుకొచ్చి.. టాక్ షోలో దుమ్ములేపేశాడు బాలయ్య. తన బావ, అల్లుళ్లతో సీక్రెట్లు చెప్పించాడు. ఎంతో సరదాగా సాగిన ఆ షో అతి తక్కువ సమయంలోనే వన్ మిలియన్ మినిట్స్ వ్యూస్ క్రాస్ చేసింది. అలా ఈ మొదటి ఎపిసోడ్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. రెండో ఎపిసోడ్ కోసం కుర్ర హీరోలను పట్టుకొచ్చాడు బాలయ్య.

డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వంటి మాస్ హీరోలతో బాలయ్య బోల్డ్ ముచ్చట్లు పెట్టేశాడు. బాలయ్య సైతం వారి భాషలోనే మాట్లాడాడు. కాస్త బూతులు కూడా వాడేశాడు. కానీ కుర్ర హీరోలతో బాలయ్య కలిసి పోయిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మూడో సీజన్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ మూడో ఎపిసోడ్ మీద రకరకాల గాసిప్స్ వస్తూనే ఉన్నాయి.

ముందుగా ఈ మూడో ఎపిసోడ్‌లో ఓ సీనియర్ హీరోయిన్, కుర్ర హీరోయిన్ వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఇద్దరు కుర్ర హీరోలే వస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ మూడో ఎపిసోడ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఇందులో భాగంగా అడివి శేష్, శర్వానంద్‌లు ఈ మూడో ఎపిసోడ్‌లో సందడి చేయబోతోన్నారు. మొత్తానికి బాలయ్య మాత్రం కుర్ర హీరోలతో బాగానే అల్లరి చేస్తున్నాడు. 

Also Read : Samantha Myositis : అనారోగ్యంతో సమంత.. భరోసా నిచ్చిన అక్కినేని హీరోలు.. వెంకీమామ కూతురి కామెంట్‌ వైరల్

Also Read : Puri Jagannadh Open Letter : పూరి భార్యాపిల్లల ఫోటోలు షేర్ చేసిన బండ్ల గణేష్.. ఓపెన్ లెటర్ మీద బండ్లన్న ట్వీట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News