Shah Rukh Khan: సల్మాన్ ఖాన్ తరువాత చంపేది షారుఖ్ ఖాన్ నే.. బాద్ షాకి సైతం హత్య బెదిరింపులు..!
Death threat for Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తరువాత ఇప్పుడు షారుఖ్ ఖాన్ కి సైతం.. హత్యా బెదిరింపులు రావడంతో.. బాలీవుడ్ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. షారుక్ ఖాన్ కి హాని కలిగిస్తాము అంటూ.. ఒక అపరిచిత వ్యక్తి పోలీసులకు తెలియజేయడంతో.. ఈ హీరోకి సైతం సెక్యూరిటీ పెంచారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే..
shah rukh khan death threat call: ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ ని చంపేస్తారు అంటూ వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. అంతేకాకుండా ఈ మధ్య ఒక గ్యాంగ్ నుంచి కూడా సల్మాన్ ఖాన్ కి మరోసారి బెదిరింపు కాల్స్ రావడంతో.. నిన్న రాత్రి ఆ గ్యాంగ్ నుంచి ఒక నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ కి చెందిన 32 ఏళ్ళ వ్యక్తికి.. సల్మాన్ కి బెదిరింపులు వస్తున్న కేసు తో సంబంధం ఉంది అంటూ ఆ నిందితుడిని కర్ణాటకలో పోలీసులు పట్టుకున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని సమాచారం. షారుక్ ఖాన్ కి బెదిరింపులు ఎదురవడం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల ప్రారంభంలో సల్మాన్ ఖాన్‌కి ఒక గ్యాంగ్ నుండి బెదిరింపు లేఖ రాగా, ఇప్పుడు షారుక్ ఖాన్‌కి కూడా ఒక కాల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ కాల్ చత్తీస్‌గడ్ రాష్ట్రం..రాయ్‌పూర్ నుండి వచ్చిందని పోలీసులు నిర్ధారించారు. కాల్ చేసిన వ్యక్తి తనను హిందుస్తానీగా గుర్తించుకోవాలని పోలీసులకు చెప్పాడట.
షారుక్ ఖాన్ బెదిరింపు కాల్ తరువాత, పోలీసులు చత్తీస్‌గడ్‌లో ఫైజాన్ ఖాన్.. అనే వ్యక్తిని గుర్తించి ప్రశ్నించారు. అయితే అతను తన ఫోన్ నవంబర్ 2న.. ఎవరో దొంగిలించారని చెప్పారు. కాల్ చేసిన వ్యక్తి షారుక్ ఖాన్‌ను హాని కలిగిస్తానని.. అతనిని చంపేస్తానని..బెదిరింపులు ఇవ్వడంతో పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు కృషి చేస్తున్నారు.
ఇంతకుముందు కూడా బాలీవుడ్ నటులకు.. ఇలాంటి బెదిరింపులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్‌ను బ్లాక్‌బక్ కేసు కారణంగా జారాలు చేయమని.. కొందరు గ్యాంగ్ సభ్యులు బెదిరించిన విషయం తెలిసిందే. సల్మాన్‌తో పాటు షారుక్ ఖాన్ సైతం ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం సినీ ప్రపంచంలో కలకలం సృష్టిస్తోంది.
ఈ బెదిరింపుల నేపథ్యంలో, రెండు ఖాన్లకూ ప్రభుత్వం ప్రొటెక్షన్‌ను పెంచింది. షారుక్ ఖాన్‌కు ప్రస్తుతం Y+ స్థాయి భద్రత కల్పిస్తుండగా, సల్మాన్‌కు కూడా ఆ విధమైన భద్రత కల్పించారు. మరి ఈ బెదిరింపు కాల్స్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. ఇకమీదట మిగతా హీరోలకి కూడా ఇలాంటి కాల్స్ వస్తాయా లేదా అన్న విషయం తెలియాలి అంటే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.
కాగా షారుక్ ఖాన్.. ఈ మధ్యనే జవాన్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం అందుకున్నారు. అలానే సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన టైగర్ 3 చిత్రంలో ఒక చిన్న కామియో పాత్రలో కనిపించి మెప్పించారు.
Also Read: బొప్పాయి ఫేస్‌మాస్క్‌తో బోలెడు ప్రయోజనాలు.. హిరోయిన్ మించిన అందం మీ సొంతం..
Also Read: ఈ 3 ఇంటి చిట్కాలతోనే తెల్ల వెంట్రుకల సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.