Criminal Or Devil Movie First Look: క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే జానర్ హారర్. ఈ జానర్ లో వచ్చిన ఎన్నో సినిమాలు ఆడియన్స్‌ని థ్రిల్ చేశాయి. హారర్ జానర్ లోనూ వైవిధ్యం చూపించిన సినిమాలైతే సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఇప్పుడు అదే బాటలో సరికొత్తగా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ C.D రాబోతోంది. ఇప్పటిదాకా చూసిన హారర్ జానర్స్ లోకెల్లా ఆడియన్స్‌కి డిఫరెంట్ అనుభూతి కలిగించే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ది కేర‌ళ స్టోరీ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండటం విశేషం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కృష్ణ అన్నం దర్శకత్వం వహిస్తున్నారు. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. RR ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. 


ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అదా శర్మ సీరియస్ లుక్‌, ఆ చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తుండటం చిత్రంలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. C.D అనే టైటిల్ క్రిమినల్ ఆర్ డెవిల్ అనే ట్యాగ్ లైన్‌తో పోస్టర్ చూడగానే సినిమాపై ఆసక్తి నెలకొనేలా ఈ ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో కొత్త దారిలో వెళుతున్నాం అని పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. మొత్తంగా అయితే ఈ C.D ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచిందనే చెప్పుకోవచ్చు. 


Also Read: Baby OTT Release Date: బేబీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?  


ఈ మూవీలో రీసెంట్ సెన్సేషన్ అదా శర్మ కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ డైలాగ్స్ అందించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. చిత్రానికి సంబంధించిన అన్ని పనులు ఫినిష్ చేసి అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు. 


నటీనటులు
అదా శర్మ, విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా 


టెక్నీషియన్స్
బ్యానర్ : SSCM ప్రొడక్షన్స్
డైరెక్టర్ : కృష్ణ అన్నం
స్టోరీ డైలాగ్స్ :  ఏ ముద్దు కృష్ణ
DOP : సతీష్ ముత్యాల
మ్యూజిక్ : RR ధృవన్
ఎడిటర్ : సత్య గిడుతూర్ 
యాక్షన్స్ : రామ కృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గిరిధర్


Also Read: Akshay Kumar's Indian Citizenship: అక్షయ్‌కి భారత పౌరసత్వం.. మరి ఇప్పటివరకు ఏంటి ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి